పట్లోళ్ల రామచంద్రారెడ్డి సంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు మరియు రాజకీయనాయకుడు. చారిత్రక ప్రసిద్ధమైన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ సమీపంలోని మారేపల్లి ఇతని స్వస్థలం. హైదరాబాదు సంస్థానం విమోచనోద్యమంలో పాల్గొని రామచంద్రారెడ్డి మొత్తం 13 సార్లు జైలుకు వెళ్ళారు. విమోచన అనంతరం ఇంటర్ మరియు డిగ్రీ పూర్తిచేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పొంది న్యాయవాద వృత్తి చేపట్టి రాజకీయాలలో కూడా ప్రవేశించారు.
1959లో పటాన్‌చెరు పంచాయతి సమితి అధ్యక్షులుగా కొంతకాలం పనిచేసి 1962 శాసనసభ ఎన్నికలలో సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా పాలుపంచుకున్నారు. ఈయన పటాన్‌చెరు ఫారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి చాలా కృషిచేశారు. ఆ తర్వాత కూడా 1971, 83, 85, 89లలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1989లో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో శాసనసభ స్పీకరుగా, నేదురుమల్లి జనార్ధన్ హయాంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు. 2004లో ఓటమి తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఏప్రిల్ 28, 2018న మరణించారు.
= = = = =
సంప్రదించిన వెబ్‌సైట్లు, గ్రంథాలు:
|
15, నవంబర్ 2014, శనివారం
పట్లోళ్ల రామచంద్రారెడ్డి (Patlolla Ramachandra Reddy)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి