23, డిసెంబర్ 2014, మంగళవారం

కె.బాలచందర్ (K.Balachander)

 కె.బాలచందర్
జననం1930
రాష్ట్రంతమిళనాడు
రంగంసినీ దర్శకుడు, నిర్మాత
మరణండిసెంబరు 23, 2014
దక్షిణ భారతదేశపు ప్రముఖ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత అయిన కైలాసం బాలచందర్ 1930లో తంజావూరు దగ్గర నన్నిలం గ్రామంలో జన్మించారు. ప్రారంభంలో అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలో పనిచేస్తూ అదే సమయంలో పలు నాటకాలు రాశారు. ఎంజీఆర్‌ కథానాయకుడిగా నటించిన దైవతాయ్‌ చిత్రానికి సంభాషణల రచయితగా చలనచిత్ర రంగంలో ప్రస్థానం ప్రారంభించి 45 ఏళ్లలో తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో 100కు పైగా చిత్రాలను రూపొందించారు. రజనీకాంత్, కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ వంటి నటుల్ని చిత్రపరిశ్రమకు పరిచయం చేశారు. భారత చలనచిత్ర రంగం అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గాను 2010 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని స్వీకరించారు. 2014, డిసెంబరు 23న మరణించారు.

సినీ ప్రస్థానం:
బాలచందర్ అకౌంటెండ్ జనరల్ కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడే ఎం.జి.రామచంద్రన్ హీరోగా నటిస్తున్న ధీవ తాల్ తమిళ చిత్రానికి సంభాషణలు వ్రాశారు. ఆ తర్వాత అనుచరుల సలహాపై ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాలకు అంకితమయ్యారు. తాను రచించిన ఒక నాటకాన్ని ఆయన దర్శకత్వంలో తీయడం, అది విజయం పొందడంతో సినిమా దర్శకుడిగా మారారు. రజినీకాంత్, కమల్‌హసన్ లాంటి నటులను సినిమాలకు పరిచయం చేసింది ఆయనే. ఏ.ఆర్.రెహమాన్‌ను సంగీత దర్శకుడిగా పరిచయం కూడా బాలచందర్ ద్వారానే జరిగింది. దాదాపు 100 సినిమాలకు ఈయన దర్శకుడు లేదా రచయితగా వ్యవహరించారు. 

గుర్తింపులు:
  • 1973 లో తమిళనాడు ప్రభుత్వంచే కలైమామణి పురస్కారం,
  • 1982లో ఏక్ దూజే కేలియే సినిమాకు గాను ఫిల్మ్ ఫేర్ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు,
  • 1987 లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం,
  • 1989లో రుద్రవీణ సినిమా కోసం జాతీయ స్థాయిలో నర్గీస్ దత్ అవార్డు,
  • 2010లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.

విభాగాలు: తమిళనాడు ప్రముఖులు, సినిమా దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు, 1930లో జన్మించినవారు, 2014లో మరణించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక