5, మార్చి 2015, గురువారం

కృష్ణకాంత్ (Krishna Kanth)

 కృష్ణకాంత్
జననంఫిబ్రవరి 28, 1927
రంగంసమరయోధుడు, రాజకీయాలు,
పదవులుఉప రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ గవర్నరు,
మరణంజూలై 27, 2002
భారతదేశ ఉప రాష్ట్రపతిగా పనిచేసిన కృష్ణకాంత్ ఫిబ్రవరి 28, 1927న జన్మించారు. చిన్నవయస్సులోనే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని ఆ తర్వాత రాజకీయాలలో ప్రవేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల గవర్నరుగా, భారతదేశ ఉపరాష్ట్రపతిగా పనిచేసి జూలై 27, 2002న మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
కృష్ణకాంత్ రాజకీయ జీవితం లాహోర్ లో విద్యార్థిదశలో ఉన్నప్పుడే క్విట్ ఇండియా ఉద్యమంతో మొదలైంది. ఇందిరాగాంధీ హయాంలో భారత జాతీయ కాంగ్రెస్ లో ప్రవేశించారు. అత్యవసర పరిస్థితిని ఎదిరించినందుకు 1975లో భారత జాతీయ కాంగ్రెసు నుండి బహిష్కరించబడ్డారు. తర్వాత జనతాపార్టీ తరఫున 1980 సంవత్సరం వరకు లోకసభ సభ్యునిగా పనిచేశారు. జనతాదళ్‌లో ఉంటూ వీ.పి.సింగ్ ప్రభుత్వంచే 1990లో ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా నియమించబడి 1997 వరకు పనిచేశారు. 1996-97 కాలంలో తమిళనాడు గవర్నగా అదనపు బాధ్యతలు కూడా చేపపట్టారు. 1997లో  భారతదేశ 10వ ఉప రాష్ట్రపతిగా ఎన్నికై 2002 జూలై 27న మరణించే వరకు ఆ పదవిని నిర్వహించారు.

బంధుత్వం:
కృష్ణకాంత్ తండ్రి లాలా అచింత్ రాం స్వాతంత్ర్య సమరయోధుడు మరియు భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు. తల్లి సత్యవతిదేవి కూడా స్వాతంత్ర్య సమర యోధురాలు.

విభాగాలు: భారతదేశ ఉప రాష్ట్రపతులు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్లు, తమిళనాడు గవర్నర్లు, 1927లో జన్మించినవారు, 2002లో మరణించినవారు, 6వ లోకసభ సభ్యులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక