29, మే 2015, శుక్రవారం

ఇరివెంటి కృష్ణమూర్తి (Iriventi Krishnamurthy)

జననంజూలై 12, 1930
స్వస్థలంమహబూబ్‌నగర్‌
రంగంసాహితీవేత్త
మరణం1991
పాలమూరు జిలాకు చెందిన సాహితీవేత్త ఇరివెంటి కృష్ణమూర్తి 1930, జూలై 12న మహబూబ్‌నగర్‌లో జన్మించారు. నిజాం కళాశాలలో డిగ్రీ అభ్యసించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి సి.నారాయణ రెడ్డి పర్యవేక్షణలో "కవిసమయములు" అనే అంశం మీద పరిశోధించి సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించి పి.హెచ్.డి పట్టా పొందారు. తన చిన్నవయస్సులోనే నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకెళ్లారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో రీడరుగా పనిచేసి పదవీవిరమణ పొందారు. 1991లో మరణించాడు.

సాహితీసేవ:
కృష్ణమూర్తి సికింద్రాబాదులోని యువభారతి సాహిత్య, సాంస్కృతిక సంస్థకు 1968 నుంచి 20 ఏళ్లపాటు నిర్వహించారు. యువభారతి సంస్థకు అధ్యక్షుడిగా ఉండి తెలంగాణలో సాహిత్య వికాసానికి కృషి సల్పినారు. 1979 నుంచి 1985 వరకు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా, 1986 నుంచి ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యదర్శిగా ఉంటూ తెలుగు సాహిత్య లోకానికి ఎనలేని సేవలు చేశారు. సంస్కృతాంధ్ర భాషా సాహిత్యంలో కాకుండా ఉర్దూ భాషా సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేశారు.

రచనలు:
వెలుగు చూపే తెలుగుపద్యాలు, దేశమును ప్రేమించుమన్నా, లక్ష్మణుడు, వీచికలు, కవిసమయములు, దశరూపక సందర్శనం, భావన, ఇరివెంటి వ్యాసాలు, ఇరివెంటి రచనలు.

ఇవి కూడా చూడండి:

విభాగాలు: పాలమూరు జిల్లా రచయితలు, మహబూబ్‌నగర్ పట్టణం, 1930లో జన్మించినవారు, 1991లో మరణించినవారు,


 = = = = =


Iriventi Krishnamurthy in telugu , Iriventi Krishnamurthi in telugu, telugu literature, telugu sahityam,

2 కామెంట్‌లు:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక