మహబూబ్ నగర్ జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గంలోని మండలాల సంఖ్య 8 నుంచి 6కు తగ్గింది. ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడినది. పునర్విభజన ఫలితంగా గతంలో ఈ నియోజకవర్గంలో ఉన్న కల్వకుర్తి మండలంలోని 14 గ్రామాలు కల్వకుర్తి నియోజకవర్గానికి తరలించగా, వంగూరు మండలం పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గంలో కలిసింది. 1962 నుంచి ఇప్పటివరకు నియోజకవర్గానికి జరిగిన 12 ఎన్నికలలో 6 సార్లు కాంగ్రెస్ పార్టీ, 5 సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించగా, ఒకసారి తెరాస గెలుపొందినది. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి పరిశీలిస్తే 1983 నుంచి జరిగిన 8 ఎన్నికలలో తెదేపా 5 సార్లు విజయం సాధించింది. పి.రాములు సార్లు ఇక్కడి నుంచి 3 సార్లు గెలుపొందినారు. పి.మహేంద్రనాథ్ ఈ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 4 సార్లు విజయం సాధించారు (2 సార్లు కాంగ్రెస్ తరఫున మరో 2 సార్లు తెదేపా తరఫున).
ఎన్నికైన శాసనసభ్యులు
1983 ఎన్నికలు 1983 ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థి పుట్తపాగా మహేంద్రనాథ్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన డి.కిరణ్ కుమార్‌పై 10,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు. మహేంద్రనాథ్‌కు 36,666 ఓట్లు రాగా, కిరణ్ కుమార్‌కు 26,344 ఓట్లు లభించాయి. 1999 ఎన్నికలు 1999 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పి.రాములు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సి.వంశీకృష్ణపై 12346 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినారు. పి.రాములు 60878 ఓట్లు సాధించగా, వంశీకృష్ణ 48532 ఓట్లు పొందినారు. మొత్తం ఐదుగురు అభ్యర్థులు పోటీచేయగా ప్రధాన పోటీ వీరిద్దరి మధ్యనే కొనసాగింది. బరిలో ఉన్న మిగితా ముగ్గురు అభ్యర్థులు డిపాజిట్టు కోల్పోయారు. 2004 ఎన్నికలు 2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి వంశీకృష్ణ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన పోతుగంటి రాములుపై 20665 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు. వంశీకృష్ణకు 65712 ఓట్లు రాగా, రాములు 45047 ఓట్లు సాధించారు. 2009 ఎన్నికలు 2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున సిటింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ మళ్ళీ పోటీ చేయగా, తెలుగుదేశం పార్టీ తరఫున పి.రాములు. ప్రజారాజ్యం పార్టీ నుండి పి.మునీంద్రనాథ్, లోక్‌సత్తా పార్టీ తరఫున జి.వెంకటేశ్వర్లు పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పి.రాములు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణపై 4800కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. 2014 ఎన్నికలు: 2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస తరఫున పోటీచేసిన గువ్వల బాల్‌రాజ్ తన సమీప ప్రత్యర్థి, కాంహ్రెస్ పార్టీకి చెందిన వంశీకృష్ణపై 11820 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. 2018 ఎన్నికలు: 2018 ఎన్నికలలో తెరాస తరఫున గువ్వల బాలరాజ్, భాజపా తరఫుమ మల్లేశ్వర్ మేదిపూర్, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన సీహెచ్ వంశీకృష్ణ చేశారు.తెరాసకు చెందిన గువ్వల బాలరాజ్ సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన చిక్కడు వంశీకృష్ణపౌ 9,114 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
|
23, జనవరి 2013, బుధవారం
అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం (Achampet Assembly Constituency)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి