23, జనవరి 2013, బుధవారం

నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం (Nagarkurnool Assembly Constituency)

మహబూబ్ నగర్ జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 5 మండలాలు కలవు. పునర్విభజన ఫలితంగా జడ్చర్ల నియోజకవర్గంలోని తిమ్మాజీపేట మండలం ఈ నియోజకవర్గంలో భాగం కాగా, ఇది వరకు ఉన్న గోపాలపేట మండలం వనపర్తి నియోజకవర్గానికి తరలించబడింది. నాగం జనార్థన్ రెడ్డి ఇక్కడి నుంచి 6 సార్లు, వి.ఎన్.గౌడ్ మూడు సార్లు విజయం సాధించారు. 1983 నుంచి ఇప్పటివరకు జరిగిన 8 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 5 సార్లు విజయం సాధించగా 5 సార్లు కూడా తెదెపా తరఫున నాగం జనార్థన్ రెడ్డి విజయం సాధించారు.

(నాగర్ జర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం)
(చిత్రం: తెవికీ సౌజన్యంతో- సభ్యుడు దేవా)
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

ఎన్నికైన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1962 పి.మహేంద్రనాథ్ కాంగ్రెస్ పార్టీ బి.ఎం.రావు స్వతంత్ర అభ్యర్థి
1967 వి.ఎన్.గౌడ్ స్వతంత్ర అభ్యర్థి కె.జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1972 వి.ఎన్.గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఏ.ఆర్.రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1978 శ్రీనివాస రావు
వి.ఎస్.గౌడ్
1983 వి.ఎన్.గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాగం జనార్థన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
1985 నాగం జనార్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వి.ఎన్.గౌడ్ కాంగ్రెస్ పార్టీ
1989 వంగా మోహన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ డి.గోపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
1994 నాగం జనార్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వంగా మోహన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ
1999 నాగం జనార్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కె.దామోదర్ రెడ్డి స్వతంత్ర్య అభ్యర్థి
2004 నాగం జనార్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కె.దామోదర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
2009 నాగం జనార్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కె.దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2012 (ఉ) నాగం జనార్ధన్ రెడ్డి ఇండిపెండెంట్ కె.దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 మర్రి జనార్థన్ రెడ్డి తెరాస కె.దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2018 మర్రి జనార్థన్ రెడ్డి తెరాస నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ

1999 ఎన్నికలు
1999 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాగం జనార్థన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన ఇండిపెండెంట్ అభ్యర్థి దామోదర్ రెడ్డిపై 31466 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినారు. నాగం జనార్థన్ రెడ్డికి 61964 ఓట్లు రాగా, దామోదర్ రెడ్డి 30498 ఓట్లు పొందినారు. రంగంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి వి.మోహన్ గౌడ్‌కు మూడవ స్థానం లభించింది. మొత్తం 8 అభ్యర్థులు పోటీ చేయగా ప్రధాన పోటీ ఈ ముగ్గురు అభ్యర్థుల మధ్యనే కొనసాగింది. మిగితా 5గురు అభ్యర్థులు డిపాజిట్టు కోల్పోయారు.

2004 ఎన్నికలు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాగం జనార్థన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అయిన కూచకుళ్ళ దామోదర్ రెడ్డిపై 1449 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నాగం జనార్థన్ రెడ్డి 57350 ఓట్లు సాధించగా, దామోదర్ రెడ్డి 55901 ఓట్లు పొందినారు.

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ తరఫున జె.రఘునందన్ గౌడ్ , కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా పరిషత్తు చైర్మెన్ కె.దామోదరరెడ్డి, ప్రజారాజ్యం పార్టీ నుండి నూర్జహాన్, లోక్‌సత్తా నుండి కె.రామకృష్ణ పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాగం జనార్థన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కూచుకుళ్ల దామోదర్ రెడ్డిపై విజయం సాధించి ఐదవసారి శాసనసభలో ప్రవేశించారు.

2012 ఉప ఎన్నికలు:
2009లో తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించిన నాగం జనార్థన్ రెడ్డి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడంతో 2012 మార్చిలో జరిగిన ఉప ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన నాగం జనార్థన్ రెడ్డి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూచుకుళ్ళ దామోదర్ రెడ్డిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. నాగంకు 71001 ఓట్లు రాగా కూచుకుళ్ళకు 43676 ఓట్లు లభించాయి. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసిన మర్రి జనార్థన్ రెడ్డికి 18608 ఓట్లు మాత్రమే లభించాయి. మొత్తం 11 అభ్యర్థు పోటీచేయగా మరో ఇండిపెండెంట్ అభ్యర్థి బి.స్వామికి మినగా అందరికీ వెయ్యి లోపు ఓట్లు మాత్రమే లభించాయి. నాగం జనార్థన్ రెడ్డికి ఇది ఐదవ విజయం.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస తరఫున పోటీచేసిన మర్రి జనార్థన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, జడ్పీ మాజీ చైర్మెన్ అయిన కూచుకుళ్ళ దామొదర్ రెడ్డిపై 14435 ఓట్ల మెజారిటితో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున మర్రి జనార్థన్ రెడ్డి, భాజపా తరఫుమ నేదునూరి దిలీప్ చారి, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన నాగం జనార్థన్ రెడ్డి పోటీచేశారు. తెరాసకు చెందిన మర్రి జనార్థన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాగం జనార్థన్ రెడ్డి పై 54354 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

నియోజకవర్గపు ప్రముఖులు
 • పి.మహేంద్రనాథ్:
 • వి.ఎన్.గౌడ్:
 • శ్రీనివాస రావు:
 • నాగం జనార్ధన్ రెడ్డి:
 • వంగా మోహన్ గౌడ్:
 • బి.ఎం.రావు:
 • కె.జనార్థన్ రెడ్డి:
 • ఏ.ఆర్.రెడ్డి:
 • డి.గోపాల్ రెడ్డి:
 • కె.దామోదర్ రెడ్డి:

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు,  నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం,  నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం,  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక