23, జనవరి 2013, బుధవారం

దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం (Devarkadra Assembly Constituency)

మహబూబ్ నగర్ జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007 నాటి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పడినది. ఈ నియోజకవర్గంలో 5 మండలాలు కలవు. రద్దయిన అమరచింత నియోజకవర్గంలోని దేవరకద్ర (పాక్షికం), చిన్నచింతకుంట మండలాలు, గతంలో వనపర్తి నియోజకవర్గంలో భాగంగా ఉన్న అడ్డాకల్, భూత్పూర్, దేవరకద్ర (పాక్షికం) మండలాలు ఈ నియోజకవర్గంలో కలిశాయి. 2014లో ఈ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలలో తెరాస పార్టీకి చెందిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి విజయం సాధించారు.

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు
నియోజకవర్గ భౌగోళిక సమాచారం
భౌగోళికంగా మహబూబ్ నగర్ జిల్లా మధ్యన ఉన్న ఈ నియోజకవర్గం జిల్లాకు చెందిన 6 నియోజకవర్గాలను సరిహద్దులుగా కలిగిఉంది. ఉత్తరాన మహబూబ్‌నగర్ నియోజకవర్గం ఉండగా, ఈశాన్యాన జడ్చర్ల నియోజకవర్గం మరియు నాగర్‌కర్నూల్ నియోజకవర్గం సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పున వనపర్తి నియోజకవర్గం సరిహద్దును, పశ్చిమాన మక్తల్ నియోజకవర్గం మరియు నారాయణపేట నియోజకవర్గాలను సరిహద్దుగా కలిగిఉంది. నియోజకవర్గం గుండా దేవరకద్ర మండలం మీదుగా హైదరాబాదు - రాయచూరు ప్రధాన రహదారి మరియు ఉత్తరం నుండి దక్షిణంగా భూత్‌పూర్, అడ్డకల్. కొత్తకోటల మీదుగా 44వ నెంబరు జాతీయ రహదారి వెళ్తున్నాయి.

ఎన్నికైన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 సీతాదయాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్వర్ణసుధాకర్ కాంగ్రెస్ పార్టీ
2014 వెంకటేశ్వర్ రెడ్డి తెరాస పవన్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2018 ఆళ్ళ వెంకటేశ్వర్ రెడ్డి తెరాస పవన్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ

2009 ఎన్నికలు
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున సీతాదయాకర్ రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ తరఫున స్వర్ణ సుధాకర్, భారతీయ జనతా పార్టీ నుండి భరత్ భూషణ్, ప్రజారాజ్యం పార్టీ తరఫున కె.ఎస్.రవి కుమార్, లోక్‌సత్తా పార్టీ తరఫున కృష్ణకుమార్ రెడ్డి పోటీ చేశారు. ప్రధానపోటీ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సీతాదయాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి స్వర్ణసుధాకర్‌పై 19034 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 శాసనసభ ఎన్నికలలో ఇక్కడీ నుంచి తెరాస అభ్యర్థిగా పోటీచేసిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన పవన్ కుమార్ రెడ్డిపై 16388 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 శాసనసభ ఎన్నికలలో తెరాస తరఫున ఆలె వెంకటేశ్వర్ రెడ్డి, భాజపా తరఫున అగ్గని నర్సిములు, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన పవన్ కుమార్ రెడ్డి పోటీచేశారు. తెరాసకు చెందిన ఆళ్ళ వెంకటేశ్వర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన పవన్ కుమార్ పై 35248 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు,  మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం,  దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం,  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక