23, జనవరి 2013, బుధవారం

గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం (Gadwal Assembly Constituency)

మహబూబ్ నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గంలో 4 మండలాలు కలవు. నియోజకవర్గాల పునర్వవస్థీకరణ ఫలితంగా ఇంతకు క్రితం ఈ నియోజకవర్గంలో కొనసాగిన అయిజ మండలం ఆలంపూర్ నియోజకవర్గానికి తరలించబడింది. 1952 నుంచి ఈ నియోజకవర్గానికి ఒక ఉప ఎన్నికతో సహా ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరగ్గా, కాంగ్రేస్ మరియు కాంగ్రెస్ (ఐ) లు 8సార్లు, తెలుగుదేశం, సమాజ్ వాది మరియు జనతా పార్టీలు ఒక్కోసారి గెలుపొందగా, మూడుసార్లు స్వతంత్ర అభ్యర్ధులు విజయం సాధించారు. అభ్యర్థుల వారీగా చూస్తే డి.కె.సమరసింహారెడ్డి అత్యధికంగా 4 సార్లు విజయం సాధించారు. డి.కె. కుటుంబానికి చెందిన నలుగురు మొత్తం 9 సార్లు ఇక్కడి నుంచి విజయం సాధించారు. డి.కె.సమర సింహారెడ్డి మరియు డి.కె.అరుణ మంత్రిపదవులు కూడా పొందారు.

(గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం)
(తెలుగు వికీపీడియా సౌజన్యంతో - సభ్యుడు దేవా)
ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

నియోజక వర్గ భౌగోళిక సమాచారం
కృష్ణా, తుంగభద్రనదుల మధ్యమహబూబ్‌నగర్ జిల్లాలో నడిగడ్డ ప్రాంతంగా పేరుపొందిన ప్రాంతంలో ఉన్న గద్వాల నియోజకవర్గానికి పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం సరిహద్దుగా ఉంది. ఉత్తరాన మక్తల్ నియోజకవర్గం ఉండగా, దక్షిణాన ఆలంపూర్ నియోజకవర్గం సరిహద్దుగా ఉన్నది. తూర్పున కొద్ది భాగం కొల్లాపూర్ నియోజకవర్గం సరిహద్దుగా ఉన్న ఈ నియోజకవర్గం గుండా హైదరాబాదు - కర్నూలు రైల్వే మార్గం వెళ్ళుచున్నది.

ఎన్నికైన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952 పాగ పుల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ

1957 డి.కె.సత్యారెడ్డి స్వతంత్ర అభ్యర్థి పాగ పుల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1962 కె.రాంభూపాల్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ ఎన్నిక -
1967 గోపాల్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి డి.కె.సత్యారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1972 పాగ పుల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ డి.కె.సత్యారెడ్డి ఎస్.టి.పి.ఎస్
1978 డి.కె.సత్యారెడ్డి జనతా పార్టీ పాగ పుల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1980(ఉ) డి.కె.సమరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ పాగ పుల్లారెడ్డి కాంగ్రెస్ (యు)
1983 డి.కె.సమరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ పాగ పుల్లారెడ్డి తెలుగుదేశం పార్టీ
1985 డి.కె.సమరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్.గోపాలరెడ్డి తెలుగుదేశం పార్టీ
1989 డి.కె.సమరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ వెంకటరామిరెడ్డి తెలుగుదేశం పార్టీ
1994 డి.కె.భరతసింహారెడ్డి స్వతంత్ర అభ్యర్థి డి.కె.సమరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1999 గట్టు భీముడు తెలుగుదేశం పార్టీ డి.కె.అరుణ కాంగ్రెస్ పార్టీ
2004 డి.కె.అరుణ సమాజ్‌వాదీ పార్టీ గట్టు భీముడు తెలుగుదేశం పార్టీ
2009 డి.కె.అరుణ కాంగ్రెస్ పార్టీ కృష్ణమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2014 డి.కె.అరుణ కాంగ్రెస్ పార్టీ కృష్ణమోహన్ రెడ్డి తెరాస
2018 బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెరాస డి.కె.అరుణ కాంగ్రెస్ పార్టీ

1999 ఎన్నికలు
1999 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గట్టు భీముడు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి.కె.అరుణపై 4546 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినారు. గట్టు భీముడు 47807 ఓట్లు పొందగా, అరుణకు 43261 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికలో మొత్తం ఆరుగురు అభ్యర్థులు పోటీచేశారు.

2004 ఎన్నికలు
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాది పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన డి.కె.అరుణ సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన గట్టు భీముడుపై 38686 ఓట్ల మెజారిటీ సాధించారు. అరుణకు 80676 ఓట్లు లభించగా, గట్టు భీముడుకు 41990 ఓట్లు వచ్చాయి. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ స్థానం తెలంగాణ రాష్ట్ర సమితికి కేటాయించగా కాంగ్రెస్ పార్టీకి చెందిన అరుణ సమాజ్‌వాది పార్టీ అభ్యరిగా పోటీచేసి గెలిచారు.

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున సిటింగ్ ఎమ్మెల్యే డి.కె.అరుణ పోటీ చేయగా, తెలుగుదేశం పార్టీ నుండి జడ్పీటీసీ సభ్యుడు కృష్ణమోహన్ రెడ్డి పోటీలో పడ్డారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ నుండి ఆశించి పార్టీ ఫిరాయించిన మాజీ శాసనసభ్యుడు గట్టు భీముడు, భారతీయ జనతా పార్టీ తరఫున బి.రాజశేఖర్ రెడ్డి, లోక్‌సత్తా పార్టీ తరఫున మురళీ శ్రీనివాస్ పోటీచేశారు. ప్రధానపోటీ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్య జరుగగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి.కె.అరుణ తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన కృష్ణమోహన్ రెడ్డిపై 10331 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడినుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన సిటింగ్ మంత్రి డి.కె.అరుణ తన సమీప ప్రత్యర్థి తెరాసకు చెందిన కృష్ణమోహన్ రెడ్డిపై 8271 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 శాసనసభ ఎన్నికలలో తెరాస తరఫున బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, భాజపా తరఫున వెంకటాద్రిరెడ్డి, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన డి.కె.అరుణ పోటీచేశారు. తెరాసకు చెందిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన డి.కె.అరుణ పై 28260 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

నియోజకవర్గ ప్రముఖులు
 • రాజా కృష్ణ రాంభూపాల్:
 • పాగ పుల్లారెడ్డి:
 • డి.కె.సత్యారెడ్డి:
 • డి.కె.సమర సింహారెడ్డి:
 • డి.కె.భరత సింహారెడ్డి:
 • గట్టు భీముడు:
 • డి.కె.అరుణ:
 • వెంకటరామిరెడ్డి:
 • కృష్ణమోహన్ రెడ్డి:

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు,  నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం,  గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం,  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక