27, జనవరి 2013, ఆదివారం

గడియారం రామకృష్ణ శర్మ (Gadiyaram Ramakrishna Sharma)

జననంమార్చి 6, 1919
రంగంసాహితీవేత్త, చరిత్ర పరిశోధకుడు,
అవార్డులుకేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (2007)
మరణంజూలై 25, 2006
జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన సాహితీవేత్తలలో గడియారం రామకృష్ణ శర్మ ప్రముఖులు. ఇతను 1919, మార్చి 6న అనంతపురంలో జన్మిచారు. మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ లో స్థిరపడి రచయితగా మంచి పేరు సంపాదించినారు. ఆలంపూర్‌కు సంబంధించిన చరిత్రను తెలిపే పలు పుస్తకాలు ఇతని చేతి నుంచి వెలువడినాయి. మాధవిద్యారణ్య అనే పుస్తకం ఇతను రచించిన పుస్తకాలన్నింటిలో ప్రామాణికమైనది.

రామకృష్ణ శర్మ సాహితీ సేవలకు గుర్తింపుగా 2007 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (తెలుగు భాషలో) మరణానంతరం ప్రకటించారు. ఇతను సాహితీవేత్తగానే కాకుండా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడుగానూ సుప్రసిద్ధులు. స్వాతంత్ర సమరంలో చురుగ్గా పాల్గొన్నారు. రామకృష్ణ శర్మ సంఘ సంస్కరణ అభిలాషి మరియు రంగస్థల నటుడు కూడా. 1942లో ఆలంపూర్ లో శ్రీరామకృష్ణ స్మారక గ్రంథాలయాన్ని, 1946లో చెన్నిపాడులో యువజన గ్రంథాలయాన్ని స్థాపించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు సప్తమ మహాసభలను ఆలంపూర్ లో ఘనంగా నిర్వహించారు. 2006, జూలై 25న గడియారం రామకృష్ణ శర్మ మరణించారు.

ప్రముఖ రచనలు
  • శతపత్రము (ఆత్మకథ)
  • వినయాదిత్యుని పల్లెపాడు, తామ్రశాసనాలు, మనవాస్తు సంపద, రన్నని గధా యుద్ధం నాటకం, కన్నడ భారతి పుస్తకం, తెలంగాణా సంచిక మొదలైనవి.

విభాగాలు: జోగులాంబ గద్వాల జిల్లా రచయితలు,  పాలమూరు జిల్లా సమరయోధులు,   ఆలంపూర్ మండలము,  

= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్ సైట్లు:
  • పాలమూరు ఆధునిక యుగకవుల చరిత్ర,
  • మహబూబ్‌నగర్ విజ్ఞానసర్వస్వము (బీఎన్ శాస్త్రి),
  • తెలంగాణ సాహితీకారులు,
Gadiyaram Ramakrishna Sharma in telugu, telugu sahitikarulu, telugu literature, telugu sahityam,

2 కామెంట్‌లు:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక