27, జనవరి 2013, ఆదివారం

నాగం జనార్ధన్ రెడ్డి (Nagam Janardhan Reddy)

నాగం జనార్ధన్ రెడ్డి
జననంమే 22, 1948
స్వస్థలంనాగపూర్
పదవులురాష్ట్ర మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యే,
రాజకీయ పార్టీభాజపా
నాగం జనార్ధన్ రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకులలో ప్రముఖులు. మే 22, 1948న జన్మించిన జనార్థన్ రెడ్డి స్వస్థలం వనపర్తి జిల్లా జిల్లా రేవల్లి మండలంలోని నాగపూర్ గ్రామం. రాజకీయాలలో అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగుదేశం పార్టి ప్రభుత్వంలో పలు మంత్రిపదవులు నిర్వహించారు. నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 సార్లు గెలుపొందినారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ప్రస్తుతం స్వంతంత్ర సభ్యుడుగా ఉన్నారు. జూన్ 3, 2013న భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. 2014 ఎన్నికలలో నాగం మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీ చేసి ఓడిపోయారు.

బాల్యం, విద్యాభ్యాసం
వీరి కుటుంబం ఆ గ్రామంలో ఉన్నత కుటుంబం. తండ్రి వెంకటస్వామి ఆ రోజుల్లో ఎక్సైజు కాంట్రాక్టులు నిర్వహించేవారు. మూడో తరగతి దాకా ఊర్లోనే చదివారు. తరువాత పీయూసీ దాకా నాగర్ కర్నూల్ లో అభ్యాసం జరిగింది. తదుపరి ఉస్మానియా వైద్య కళాశాలలో వైద్య విద్యనభ్యసించారు. అప్పట్లో తెలంగాణా ఉద్యమం ప్రభలంగా ఉండటంతో పాటు విశ్వవిద్యాలయం కేంద్రంగా నడుస్తుండటంతో ఆయన ఈ ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యారు. చాలా సార్లు అరెస్టు కూడా అయ్యారు.

రాజకీయ జీవితం
వైద్య విద్య పూర్తయ్యాక 1976లో నాగర్ కర్నూల్ లో వైద్యునిగా ప్రాక్టీసు మొదలు పెట్టారు. తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి 1983లో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేశారు. 52 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1985లో జరిగిన ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. 1989 లో తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పొటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ 1994 లో మళ్ళీ తెలుగుదేశంలో చేరి టికెట్ సంపాదించి విజయం సాధించాడు. అప్పటి నుంచి ఇప్పటి దాకా వరుసగా 5 సార్లు మొత్తంపై 6 సార్లు నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గం నుంచి గెలుపొందినారు. తెలుగుదేశం పార్టీ వ్యతిరేఖ కార్యక్రమాలు చేయడం , పార్టీ అధ్యక్షుడినే విమర్శించడం ద్వారా పార్టీ నుంచి 2011 లొ బహిష్కరణకు గురి అయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికలలో ఇండిపెండెంటుగా పోటీచేసి 2012 ఉప ఎన్నికలలో విజయం సాధించారు. 2014 ఎన్నికలలో నాగం మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇతని కుమారుడు నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీచేసి పరాజయం పొందారు.

నిర్వహించిన పదవులు
  • రాష్ట్ర మంత్రివర్గంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్, అటవీ, వైద్య ఆరోగ్య, పౌర సరఫరా, పంచాయితీ రాజ్ తదితర శాఖలను నిర్వహించాడు.
  • తెలుగుదేశం పార్టీ పోలీట్ బ్యూరో సభ్యుడు.
విభాగాలు: నాగర్‌కర్నూల్ జిల్లా రాజకీయ నాయకులు,  రేవల్లి మండలము, నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం, 13వ శాసనసభ సభ్యులు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక