ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు
ఎన్నికైన శాసనసభ్యులు:
1999 ఎన్నికలు
1999 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.శంకర్ రావు తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎస్.బాలుపై 6010 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. శంకర్ రావుకు 56195 ఓట్లు లభించగా, ఎస్.బాలు 50185 ఓట్లు పొందినారు. మొత్తం ఐదుగురు పోటీచేయగా ప్రధాన పోటీ వీరిద్దరి మధ్యనే కొనసాగింది. బరిలో ఉన్న మిగితా ముగ్గురు అభ్యర్థులు డిపాజిట్టు కోల్పోయారు. 2004 ఎన్నికలు 2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన పి.శంకర్ రావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బక్కిని నర్సిములుపై 10632 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. శంకర్ రావుకు 65360 ఓట్లు రాగా, బక్కిని నర్సిములు 54728 ఓట్లు సాధించారు. 2009 ఎన్నికలు 2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున వనం ఝాన్సీరాణి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతాప్ రెడ్డి, ప్రజారాజ్యం పార్టీ నుండి మిట్టూనాయక్, లోక్‌సత్తా పార్టీ తరఫున పి.నరేందర్, తెలుగుదేశం పార్టీ మద్దతుతో మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన అంజయ్య యాదవ్ పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రతాపరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి వై.అంజయ్య యాదవ్ పై 9400కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014 ఎన్నికలు: 2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాసకు చెందిన అంజయ్యయాదవ్ తన సమీప ప్రత్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి చెందిన చౌలపల్లి ప్రతాప్‌రెడ్డిపై 17328 ఓట్ల మెజారిటితో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. 2018 ఎన్నికలు: 2018 ఎన్నికలలో తెరాస తరఫున చై.అంజయ్య యాదవ్, భాజపా తరఫుమ ఎన్.శ్రీవర్థన్ రెడ్డి, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన సి.ప్రతాప్ రెడ్డి పోటీచేశారు. తెరాసకు చెందిన అంజయ్య యాదవ్ ఎల్గనమోని తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన చౌలపల్లి ప్రతాప్ రెడ్డి పై 20425 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నియోజకవర్గ ప్రముఖులు
|
23, జనవరి 2013, బుధవారం
షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం (Shadnagar Assembly Constituency)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి