మానవపాడు జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము జిల్లాలో దక్షిణ భాగంలో కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య తుంగభద్ర తీరాన ఉంది. 44వ నెంబరు జాతీయ రహదారి, సికింద్రాబాదు నుంచి డోన్ వెళ్ళు రైలుమార్గం మండల గుండా వెళ్ళుచున్నాయి. స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ వైతాళికుడిగా పేరుపొందిన సురవరం ప్రతాపరెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శిగా నియమితులైన సురవరం సుధాకరరెడ్డి, నిజాం పోరాటయోధుడు పాగపుల్లారెడ్డి, మాజీ మంత్రి చల్లా రాంభూపాల్ రెడ్డి, కవి కేశవపంతుల నరసింహశాస్త్రి, రచయిత ఎస్.ఎం.హుస్సేన్ ఈ మండలానికి చెందినవారే. ఈ మండలము గద్వాల రెవెన్యూ డివిజన్, ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 51410.
మండల సరిహద్దులు: మానవపాడు మండలమునకు తూర్పున ఆలంపూర్ మండలం, పశ్చిమాన ఇటిక్యాల, వడ్డేపల్లి మండలాలు, దక్షిణమున తుంగభద్ర నది, ఉత్తరమున కృష్ణానది సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణమున తుంగభద్రనది ఆవల కర్నూలు జిల్లా సరిహద్దుగా ఉంది. ఉత్తరమున కృష్ణానది అవతల పెబ్బేరు మండలం ఉంది.
జనాభా:
2001 లెక్కల ప్రకారం మానవపాడు మండల జనాభా 46022. ఇందులో పురుషులు 23,335 మరియు మహిళలు 22,687. ఎస్సీల సంఖ్య 1886, ఎస్టీల సంఖ్య 180. అక్ష్యరాస్యులు 18,795. మండలం మొత్తం గ్రామీణ ప్రాంతంలోకే వస్తుంది. 2001 ప్రకారం మండలంలో 5వేల జనాభా పైబడి ఉన్న గ్రామము 2, 2 నుంచి 5వేల జనాభా ఉన గ్రామము 7 ఉన్నాయి. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 51410. ఇందులో పురుషులు 26119, మహిళలు 25291. జనాభాలో ఇది జిల్లాలో 45వ స్థానంలో ఉంది. రవాణా సౌకర్యాలు: దేశంలోనే పొడవైన 44వ నెంబరు జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. ఆలంపూర్ చౌరస్తా జాతీయ రహదారిపై జిల్లాలోనే ప్రముఖ కూడలి. ఆలంపూర్ వెళ్ళుటకు, కర్ణాటక నుంచి రాయచూర్ వెళ్ళుటకు ఈ కూడలి ప్రధానమైనది. సికింద్రాబాదు నుంచి డోన్ వెళ్ళు రైల్వేలైన్ మండలం గుండా పోవుచున్నది. మానోపాడ్, జోగులాంబ హాల్ట్, ఆలంపూర్ రోడ్ రైల్వేస్టేషన్లు ఈ మండలంలోనే ఉన్నాయి. ఆలంపూర్ క్షేత్రానికి వెళ్ళే రహదారి మరియు అయిజా మీదుగా రాయచూర్ వెళ్ళు రహదారి ఈ కూడలి నుంచే ప్రారంభమౌతాయి.
ఈ మండలము ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగము. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రశాంతి ఎన్నికయ్యారు.2014లో మానోపాడు ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన జయమ్మ ఎన్నికయ్యారు. విద్యాసంస్థలు: 2008-09 నాటికి మండలంలో 19 ప్రాథమిక పాఠశాలలు (18 మండల పరిషత్తు, 1 ప్రైవేట్), 15 ప్రాథమికోన్నత పాఠశాలలు (13 మండల పరిషత్తు, 2 ప్రైవేట్), 6 ఉన్నత పాఠశాలలు (5 జడ్పీ, 1 ప్రైవేట్), ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది. వ్యవసాయం, నీటిపారుదల: మండలం మొత్తం విస్తీర్ణం 27400 హెక్టార్లలో 61% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట వరి. మొక్కజొన్న, కందులు, ప్రత్తి కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 483 మిమీ. మండలంలో సుమారు 3600 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
24, జనవరి 2013, గురువారం
మానోపాడు మండలము (Manopad Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి