వడ్డేపల్లి జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలము. గద్వాల రెవెన్యూ డివిజన్, ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ఇది జిల్లా దక్షిణ సరిహద్దులో తుంగభద్ర నది తీరాన ఉంది. మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు 19 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇది జిల్లాలో దక్షినసరిహద్దులో తుంగభద్రానది తీరాన ఉన్నది. వడ్డేపల్లి మరియు రాజోలి మండలంలోని మేజర్ గ్రామపంచాయతీలు. తుంగభద్ర నది తీరాన ఉన్న రాజోలి చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి. ఇక్కడ రాజుల కాలం నాటి కోట, ప్రాచీనమైన వైకుంఠనారాయణస్వామి ఆలయం ఉన్నాయి.
మే 11, 2019న ఈ గ్రామానికి చెందిన 15 మంది కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో మరణించారు. సరిహద్దులు: వడ్డేపల్లి మండలానికి దక్షిణమున తుంగభద్రనది దానికి ఆవల కర్నూలు జిల్లా, తూర్పున మానవపాడు మండలం, పశ్చిమాన అయిజ మండలం, ఉత్తరాన ఇటిక్యాల మండలం సరిహద్దుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 41224. ఇందులో పురుషులు 20972, మహిళలు 20252. ఎస్సీల సంఖ్య 9020 మరియు ఎస్టీల సంఖ్య 192. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 69510. ఇందులో పురుషులు 35318, మహిళలు 34192. జనాభాలో ఇది జిల్లాలో 13వ స్థానంలో ఉంది. రవాణా సౌకర్యాలు: కర్నూలు నుంచి రాయచూర్ (వయా ఆలంపూర్ చౌరస్తా, అయిజా) రహదారి మండలం నుంచి వెళ్ళుచున్నది. వడ్డేపల్లి నుంచి రాజోలి మీదుగా సుంకేశుల డ్యాంపై నుంచి కూడా కర్నూలుకు రహదారి ఉంది. చరిత్ర: మండలంలోని రాజోలి ప్రాంతం చరిత్రలో పేరుగాంచినది. తుంగభద్ర ఒడ్డున ఉన్న రాజోలిలో రాజులు నిర్మించిన కోటగూడలు, ప్రాచీన ఆలయాలున్నాయి.
వడ్డేపల్లి మండలము ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూలు లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. 2006 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎన్.శ్రీనివాసులు ఎన్నికయ్యారు. 2014లో వడ్డేపల్లి ఎంపీపీగా తెలుగుదేశం పార్టీకి చెందిన సుజాత ఎన్నికయ్యారు. విద్యాసంస్థలు: 2008-09 నాటికి మండలంలో 28 ప్రాథమిక పాఠశాలలు (27 మండల పరిషత్తు, 1 ప్రైవేట్), 16 ప్రాథమికోన్నత పాఠశాలలు (12 మండల పరిషత్తు, 4 ప్రైవేట్), 13 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 8 జడ్పీ, 8 ప్రైవేట్ ఎయిడెడ్, 3 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాల ఉన్నది. వ్యవసాయం, నీటిపారుదల: మండలం మొత్తం విస్తీర్ణం 26445 హెక్టార్లలో 45% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట వరి. మొక్కజొన్న, జొన్నలు, వేరుశనగ కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 546 మిమీ. మండలంలో సుమారు 6000 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.
|
24, జనవరి 2013, గురువారం
వడ్డేపల్లి మండలము (Waddepally Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి