24, జనవరి 2013, గురువారం

మిడ్జిల్ మండలము (Midjil Mandal)

జిల్లా మహబూబ్ నగర్
రెవెన్యూ డివిజన్ మహబూబ్ నగర్
జనాభా52288 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంజడ్చర్ల
లోకసభ నియోజకవర్గంమహబూబ్ నగర్
పర్యాటక ప్రాంతాలు
ముఖ్య పంటలుప్రత్తి, వరి
మండల ప్రముఖులు
మిడ్జిల్ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మండలము. మహబూబ్‌నగర్ నుంచి కల్వకుర్తి వెళ్ళు ప్రధాన రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. ఈ మండలము మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజన్, జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 52288. మండలంలో 28 రెవెన్యూ గ్రామాలు, 29 గ్రామపంచాయతీలు కలవు.

సరిహద్దులు:
ఈ మండలమునకు ఉత్తరమున జడ్చర్ల, తలకొండపల్లి మండలములు, తూర్పున వెల్దండ మండలము, దక్షిణమున కల్వకుర్తి, తాడూరు, తిమ్మాజీపేట మండలాలు, పశ్చిమాన జడ్చర్ల మండలము సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 46450. ఇందులో పురుషులు 23386, మహిళలు 23064.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 52288. ఇందులో పురుషులు 26229, మహిళలు 26059. జనాభాలో ఇది జిల్లాలో 41వ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
మహబూబ్ నగర్ నుంచి కల్వకుర్తి వెళ్ళు రహదారి మండలం నుంచే వెళ్ళుచున్నది.

రాజకీయాలు:
మిడ్జిల్ మండలము జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గములో బాగము. 2006లో మిడ్జిల్ జడ్పీటీసిగా ఇండిపెండెంటుగా పోటీచేసిన ఎనుముల రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. 2009లో రేవంత్ రెడ్డి కోడంగల్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2014లో ఎంపీపీగా తెరాస పార్టీకి చెందిన దీప ఎన్నికయ్యారు.

జడ్చర్ల నియోజకవర్గంలో
మిడ్జిల్ మండల స్థానం (పసుపు రంగు)
విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 44 ప్రాథమిక పాఠశాలలు (1 ప్రభుత్వ, 41 మండల పరిషత్తు, 2 ప్రైవేట్), 16 ప్రాథమికోన్నత పాఠశాలలు (15 మండల పరిషత్తు, 1 ప్రైవేట్), 7 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 6 జడ్పీ), 1 ప్రభుత్వ జూనియర్ కళాశాలు ఉన్నది.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 31416 హెక్టార్లలో 49% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట ప్రత్తి, వరి. మొక్కజొన్న, వేరుశనగ కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 618 మిమీ. మండలంలో సుమారు 7000 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

కాలరేఖ:
  • 2019, ఆగస్టు 4: మిడ్జిల్ మండలం కొత్తపల్లి వద్ద ఆటోను లారీ ఢీకొని 14 మంది మరణించారు.


  విభాగము: మిడ్జిల్ మండలములోని గ్రామాలు
(Portal: Villages in  Midjil Mandal)
రెవెన్యూ గ్రామాలు
  1. భైరంపల్లి (Bhairampalli),
  2. బోయిన్‌పల్లి (Boinpalli),
  3. బొమ్మరాసిపల్లి (Bommarasipalli),
  4. చేదుఘట్టు (Chedughattu),
  5. చిల్వేరు (Chiluveru),
  6. డోనూర్ (Donur),
  7. గుడిగాన్‌పల్లి (Gudiganpalli),
  8. ఇప్పాపహాడ్ (Ippaipahad),
  9. జగబోయిన్‌పల్లి (Jagboinpalli),
  10. జకనాలపల్లి (Jakanalapalli),
  11. కంచన్‌పల్లి (Kanchanpalli),
  12. కొత్తపల్లి (Kothapalli),
  13. కొత్తూర్ (Kothur),
  14. మాధారం (Madharam),
  15. మసిగుండ్లపల్లి (Masigundlapalli),
  16. మిడ్జిల్ (Midjil),
  17. మున్ననూర్ (Munnanur),
  18. నర్సంపల్లి (Narsampalli),
  19. రాచలపల్లి (Rachalapalli),
  20. రాంరెడ్డిపల్లి (Ramreddipalli),
  21. రేవల్లి (Revally),
  22. సింగందొడ్డి (Singamdoddi),
  23. ఊర్కొండ (Urkonda),
  24. ఊర్కొండపేట (Urkondapeta),
  25. వస్పుల (Vaspula),
  26. వెలుగోముల (Velugommula),
  27. వేముల (Vemula),
  28. వాడ్యాల్ (Wadiyal),
రెవెన్యూ గ్రామాలు కాని పంచాయతీలు:
  1. ముచ్చర్లపల్లి (Mucharlapalli),
  2. వల్లభరావుపల్లి (Vallabharaopalli)


హోం,
విభాగాలు:
మహబూబ్ నగర్ జిల్లా మండలాలు,  మిడ్జిల్ మండలము, మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్,  జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక