7, ఫిబ్రవరి 2013, గురువారం

కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి (Kuchukulla Damodar Reddy)

కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి పాలమూరు జిల్లాకు చెందిన రాజకీయనాయకుడు. గ్రామసర్పంచి నుంచి జిల్లా పరిషత్తు చైర్మెన్ వరకు వివిధ పదవులను నిర్వహించిన దామోదర్ రెడ్డి డిసెంబరు 12, 1947న జన్మించారు. ఇతని స్వగ్రామం నాగర్ కర్నూల్ మండలంలోని తూడుకుర్తి గ్రామం. తూడుకుర్తి గ్రామసర్పంచి గానూ, మండల ఉపాధ్యక్షులు, మండల అధ్యక్షులుగా, జడ్పీ చైర్మెన్ గా పనిచేశారు. శాసనసభ్యుడిగా మాత్రం 5 సార్లు పోటీచేసిననూ విజయం సాధించలేరు.

రాజకీయ ప్రస్థానం
కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి 1981లో తన స్వగ్రామమైన తూడుకుర్తి సర్పంచిగా ఎన్నికై రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1989లో మండల ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 1994లో నాగర్ కర్నూలు మండల అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికై ఐదేళ్ళు పనిచేశారు. 1999 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిననూ టికెట్టు లభించకపోవడంతో ఇండిపెండెంటుగా పోటీచేసి రెండో స్థానంలో నిలిచారు. 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున పోటీచేసిననూ సుమారు వెయ్యిన్నర ఓట్ల తేడాతో పరాజయం పొందినారు. 2006లో తాడూరు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున జడ్పీటీసిగా ఎన్నికై జిల్లా పరిషత్తులో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లభించడంతో చైర్మెన్ అయ్యారు. 2009లో మరోసారి శాసనసభకు పోటీచేసి ఓడిపోయారు. 2012 ఉప ఎన్నికలలో మరోసారి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి వరసగా నాలుగవ సారి నాగం జనార్థన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2014 శాసనసభ ఎన్నికలలో మళ్ళీ నాగర్‌కర్నూల్ నుంచి పోటీ చేసి తెరాస అభ్యర్థి మర్రి జనార్థన్ రెడ్డి చేతిలో పరాజయం పొందారు. సెప్టెంబరు 2019లో ప్రభుత్వ విప్‌గా నియమితులైనారు.

విభాగాలు: నాగర్‌కర్నూల్ జిల్లా ప్రముఖులు,  నాగర్‌కర్నూల్ మండలము, జిల్లా పరిషత్తు చైర్మెన్లు,   

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక