18, మార్చి 2013, సోమవారం

మందుముల నరసింగరావు (Mandumula Narasing Rao)

మందుముల నరసింగరావు
(1896 - 1976)
నిర్వహించిన పదవులు రాష్ట్ర మంత్రి (1957-62)
స్వస్థలం తలకొండపల్లి
జిల్లామహబూబ్ నగర్
నియోజకవర్గంకల్వకుర్తి అ/ని,
పాలమూరు జిల్లాకు చెందిన సమరయోధులలో ప్రముఖుడైన మందుముల నరసింగరావు మార్చి 17, 1896న ప్రస్తుత రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో జన్మించారు. స్వగ్రామమైన తలకొండపల్లిలో ప్రాథమిక విద్య పూర్తిచేసి 1912లో హైదరాబాదు వచ్చి ఉన్నత విద్యనభ్యసించారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. పర్షియన్ భాషలో కూడా ఇతను గొప్ప పండితుడు మరియు ప్రముఖ పత్రికా రచయితగా పేరుపొందారు.

1916లో తన తోటివారితో కలిసి వామన్ నాయక్ అధ్యక్షతన ‘యంగ్‌మెన్ యూనియన్’ను స్థాపించారు. 1921లో ఆంధ్రజనసంఘాన్ని స్థాపించిన వారిలో ఒకరు. 1927లో న్యాయవాదవృత్తికి స్వస్తి చెప్పి పత్రికారచన, రాజకీయాలు చేపట్టారు. రయ్యత్ అనే ఉర్దూ వార్తాపత్రికకు వ్యవస్థాపక సంపాదక బాధ్యతలు చేపట్టారు. రయ్యత్ ద్వారా నిజాం నిరంకుశాన్ని ఎండగడుతూ ప్రజలను చైతన్య పర్చారు. 1927లో ప్రారంభించబడిన రయ్యత్ వార్తాపత్రిక నిజాం ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు నిషేధానికి గురై 1931లో దినపత్రికగా పునఃప్రారంభమైంది.

మందుముల సమరరంగంలో కూడా కీలకపాత్ర వహించి 1937లో ఇందూరు (నిజామాబాదు)లో జరిగిన 6వ ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించారు. 1938-42 కాలంలో నిజాం లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు. 1942లో హైదరాబాదు జర్నలిస్టుల సంఘం అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 1947లో జాయిన్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టు అయ్యారు. ఇవేకాక బాల్యవివాహాల రద్దుకు, వితంతు వివాహాలకు బాగా కృషిచేశారు.

1952లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున హైదరాబాదు శాసనసభకు ఎన్నికయ్యారు. భూసంస్కరణల అమలుకై ఏర్పాటైన భూకమీషన్‌లో అధ్యక్షునిగా నియమితులైనారు. 1957-62 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేశారు. నిజాం కాలంలోని దుష్పరిపాలనను వర్ణిస్తూ "50 సంవత్సరాల హైదరాబాదు" గ్రంథాన్ని స్వీయజీవిత చరిత్రగా రచించారు. మార్చి 12, 1976న మందుముల మరణించారు.

బంధుత్వాలు:
మందుముల నరసింగరావు కూతురు అనంతలక్ష్మిని బూర్గుల రామకృష్ణారావు రెండో వివాహం చేసుకున్నారు. సమరయోధుడిగా పేరుపొందిన మందుముల రామచంద్రారావు ఈయన సోదరుడు.
 
 
 


సంప్రదించిన వెబ్‌సైట్లు, పుస్తకాలు:
  • గోల్కొండ పత్రిక సంచికలు,
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎస్.శాస్త్రి),
  • చరితార్థులు మన తెలుగు పెద్దలు (రచన- మల్లాది కృష్ణానంద్),
  • పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర (రచన- ఆచార్య ఎస్వీ రామారావు), 
  • ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర (రచన- జి.వెంకట రామారావు), 
  • స్వాతంత్ర్య సంగ్రామంలో తెలంగాణ ఆణిముత్యాలు (రచన- మల్లయ్య), 
  • 50 సంవత్సరాల హైదరాబాదు (రచన- మందుముల నరసింగరావు),

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక