20, మార్చి 2013, బుధవారం

పి.చంద్రశేఖర్ (P.Chandra Sekhar)

పొడపాటి చంద్రశేఖర్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయనాయకుడు. ఇతను జూలై 15, 1949న జన్మించారు. బీకాం, ఎల్.ఎల్.బి. అభ్యసించారు. ప్రారంభంలో 1981లో మహబూబ్‌నగర్ పురపాలకసంఘం కౌన్సిలరుగా ఇండిపెండెంటుగా పోటీచేసి విజయం సాధించారు. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపనతో ఆ పార్టీలో చేరి ఇటీవలి వరకు ఇదే పార్టీలో కొనసాగారు. 1983లో మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి శాసనసభకు తొలిసారి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1985, 1994, 1999లలోకూడా ఇదే స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికయ్యారు. 1983-84లలో ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పోరేషన్ చైర్మెన్‌గా, 1984-85లలో న్యాయశాఖామంత్రిగా, 1985-88 కాలంలో ఆర్టీసీ గోల్కొండ రీజియన్ చైర్మెన్‌గా, 1989లో పంచాయతిరాజ్ మంత్రిగా, 1994లో రవాణాశాఖ మంత్రిగా, 1998లో చిన్న, మధ్యతరహా శాఖ మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, పోలిట్ బ్యూరో సభ్యునిగా పనిచేశారు. మట్టిదీపాలు, తోరణాలు, అమ్మవడిలో, కిరణాలు లాంటి రచనలు కూడా చేశారు. 2013, జూన్ 3న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. 2014 ఎన్నికలలో మహబూబ్‌నగర్ లోకసభ స్థానానికి ఇండిపెండెంటుగా నామినేషన్ వేసి ఉపసంహరించుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారు.

విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులుమహబూబ్‌నగర్ జిల్లా రచయితలుమహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక