గద్వాల పట్టణం నడిబొడ్డున ఉన్న చారిత్రాత్మకమైన పూర్తిగా మట్టితో కట్టబడిన కోటను పెద్ద సోమభూపాలుడు క్రీ.శ.1662లో నిర్మించాడు. ఇతనికే నలసోమనాద్రి అనే పేరు కూడా ఉంది. ఇదే కోటలో చెన్నకేశవస్వామి దేవాలయాన్ని సోమనాద్రియే అత్యంత సుందరంగా నిర్మించాడు. దేవాలయ గోడలపై ఉన్న శిల్పకళ, దేవాలయం ఎదుట ఉన్న 90 అడుగుల గాలిగోపురం ఇప్పటికీ చూపురులను ఆకట్టుకుంటాయి. కోట లోపల ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల నడుస్తున్నాయి. 1948లో సంస్థాన చివరి పాలకురాలు మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ఈ కోటను ప్రభుత్వానికి అప్పంగించింది. చరిత్ర: కృష్ణాతీర ప్రాంతంలో వేటకు వచ్చిన పూడురు రాజు సోమనాద్రి ఈ ప్రాంతంలో పర్యటిస్తుండగా వేటకుక్కను కుందేను తరమడం చూసి పరవశుడై ఈ ప్రాంతంలో ఏదోమహత్య్మం ఉందని భావించి మట్టితో పెద్ద కోటను నిర్మించి తన రాజధానిని పూడూరు నుంచి గద్వాలకు మార్చాడు. పూర్తిగా మట్టితో నిర్మించిన కోటలలో ఇది పేరెన్నికగన్నది. ఈ కోట 17వ శతాబ్దిలో నిర్మితమైనది. కోట చుట్టూ పెద్ద కండకాలను నిర్మించి శతృదుర్భేద్యంగా ఏర్పాటుచేశాడు. ఇప్పటికీ ఇది గద్వాల పట్టణం నడిబొడ్డున దర్శనమిస్తుంది. కోటలోపల సంస్థానాధీశులు నిర్మించిన చెన్నకేశవస్వామి ఆలయం ఉంది. డిగ్రీకళాశాల, జూనియర్ కళాశాల కోటలోపలే ఏర్పాటైనాయి. జూరాల ప్రాజెక్టు, బీచుపల్లి సందర్శనకు వచ్చే పర్యాటకులు చారిత్రకమైన ఈ మట్టి కోటను కూడా దర్శిసారు. గద్వాల మట్టికోట ఇతివృత్తంగానే "అరుంధతి" సినిమా విడుదల చేశారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
21, ఏప్రిల్ 2013, ఆదివారం
గద్వాల కోట (Gadwal Fort)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి