మహబూబ్ నగర్ జిల్లాలోని 5 రెవెన్యూ డివిజన్లలో గద్వాల రెవెన్యూ డివిజన్ ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ క్రింద 9 మండలాలు, 202 రెవెన్యూ గ్రామాలు, 196 గ్రామపంచాయతీలు కలవు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ డివిజన్ జనాభా 6,08,494. ఈ డివిజన్ 2 అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించియుంది. డివిజన్ పరిధిలో 2 పురపాలక సంఘాలు కూడా ఉన్నాయి. మండలాల సంఖ్యలోనూ, జనాభాలోనూ ఈ డివిజన్ 4వ స్థానంలో ఉన్నది.
1.ఆలంపూర్ | 4.గద్వాల | 7.మల్డకల్ |
2.ఇటిక్యాల | 5.ఘట్టు | 8.మానోపాడ్ |
3.ఐజ | 6.ధరూర్ | 9.వడ్డేపల్లి |
జనాభా:
2011 లెక్కల ప్రకారం గద్వాల డివిజన్ జనాభా 6,08,494. ఇందులో పట్టణ జనాభా 63,489, గ్రామీణ జనాభా 5,45,005. గద్వాల ఒక్కటే పట్టణ ప్రాంతము కాగా 2012లో ఐజను పురపాలక సంఘం (నగరపంచాయతి)గా ప్రకటించడంతో డివిజన్‌లో రెండు పురపాలక సంఘాలయ్యాయి.
నియోజకవర్గాలు
ఈ రెవెన్యూ డివిజన్ పరిధి 2 అసెంబ్లీ నియోజకవర్గాలలో విస్తరించియుంది. లోకసభ నియోజకవర్గం మాత్రం ఒక్కటే.
అసెంబ్లీ నియోజకవర్గాలు | లోకసభ నియోజకవర్గాలు |
---|---|
|
|
విభాగాలు: మహబూబ్ నగర్ జిల్లా రెవెన్యూ డివిజన్లు, గద్వాల రెవెన్యూ డివిజన్, |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి