మాదారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలమునకు చెందిన గ్రామము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 585. మాదారం ర్యాకమకొండపై శ్రీతిరుమలనాథస్వామి వెలసినారు. అలాగే వాసరాయస్వామి ఆలయం, చెన్నకేశవస్వామి ఆలయం, గోపాలస్వామి ఆలయం, నాగులగుడి, నరసింహస్వామి ఆలయం, శివాలయం ఉన్నాయి.
భౌగోళికం, సరిహద్దులు: మాదారం గ్రామము భౌగోళికంగా హన్వాడ మండలం మధ్యలో ఉన్నది. ఈ గ్రామానికి తూర్పున మండల కేంద్రం హన్వాడ, ఉత్తరమున అమ్మాపూర్, దక్షిణమున యరన్‌పల్లి, పశ్చిమాన దోరసముద్రం గ్రామాలున్నాయి తిరుమలనాథస్వామి ఆలయం: ఎత్తయిన కొండ గుహల ప్రాంతంలో తిరుమలనాథస్వామి స్వయంభూవుగా వెలిశారు. ఈ ఆలయానికి 350 సం.ల చరిత్ర ఉంది. నరసింహస్వామి రాతికొండలోంచి చీల్చుకొస్తున్నట్లుగా ఆలయ ముఖద్వారం వద్ద ప్రతిమ ఉంది. రాతిగుండుపై శ్రీఆంజనేయస్వామి ప్రతిమ ఉంది. మహబూబ్ నగర్ నుంచి ర్యాకమకొండకు వెళ్ళుటకు వేపూర్, చంద్రాస్‌పల్లి, కొత్లాబాద్ వైపు వెళ్ళే బస్సులలో యూరోనిపల్లి గేటు వద్ద దిగి అటునుంచి స్వామివారి ముఖద్వారం గుండా సుమారు మూడున్నర కిమీ కాలినడకన వెళ్ళాలి. ఏటా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. జనాభా: 2001 జనాభా లెక్కల ప్రకారము గ్రామ జనాభా 585. ఇందులో పురుషులు 306, మహిళలు 279. మండలంలోని చిన్న గ్రామాలలో ఇది ఒకటి. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 757. ఇందులో పురుషులు 384, మహిళలు 373. గృహాల సంఖ్య 146, అక్షరాస్యత శాతం 38.1%. గ్రామ కోడ్ సంఖ్య 575061. విద్యాసంస్థలు: గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది.
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
19, ఏప్రిల్ 2013, శుక్రవారం
మాదారం (Madharam)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి