హన్వాడ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది పంచాయతికేంద్రము. 2001 లెక్కల ప్రకారము గ్రామ జనాభా 8319. ఈ గ్రామము మహబూబ్‌నగర్ నుంచి 10 కిమీ దూరంలో ఉంది. గ్రామపరిధిలో 1290 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. మహబూబ్‌నగర్- తాండూరు ప్రధాన రహదారి గ్రామం మీదుగా వెళుతుంది. రహదారి ప్రక్కనే పురాతన ఆంజనేయస్వామి ఆలయం ఉంది. గ్రామానికి దూరంలో ప్రధాన రహదారి ప్రక్కన మహబూబ్‌నగర్ వైపు పోలీస్ స్టేషన్ ఉంది. గ్రామంలో పురాతనమైన ఆంజనేయస్వామి ఆలయం, శివాలయం, బసవన్న గుడి ఉన్నాయి.
భౌగోళికం, సరిహద్దులు: హన్వాడ 16.81 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 77.92 డిగ్రీల తూర్పు రేఖాంశంపై ఉంది. ఈ గ్రామానికి దక్షిణాన మహబూబ్‌నగర్, కోయిలకొండ మండలాలు ఉండగా, ఉత్తరమున నాయినోనిపల్లి, తూర్పున టంకర, పెద్దదర్పలి, పశ్చిమాన మాదారం, యరన్ పల్లి, వాయువ్యాన అమ్మాపూర్ గ్రామం సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: మహబూబ్‌నగర్ నుంచి కోస్గి వెళ్ళు ప్రధాన రహదారి గ్రామం మీదుగా వెళ్ళుచున్నది. తాండూరు, పరిగి వెళ్ళు ఆర్టీసి బస్సులే కాకుండా ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. జనాభా: 2001 జనాభా లెక్కల ప్రకారము గ్రామ జనాభా 8313. ఇందులో పురుషులు 4243, మహిళలు 4076. ఇదిమండలంలో పెద్ద గ్రామము. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9916. ఇందులో పురుషులు 4974, మహిళలు 4942. గృహాల సంఖ్య 2165, అక్షరాస్యత శాతం 46.5%. గ్రామ కోడ్ సంఖ్య 575064. రాజకీయాలు: 2009 శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామం నుంచి మహాకూటమి అభ్యర్థి తెరాసకు చెందిన ఇబ్రహీంకు 46 ఓట్ల మెజారిటీ లభించింది. ఇబ్రహీంకు 818 ఓట్లు రాగా, ఇండిపెండెంట్ అభ్యర్థి రాజేశ్వర్ రెడ్డికి 772 ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులివీరన్నకు 394 ఓట్లు లభించాయి. గ్రామంలో 2 ఎంపీటీసి స్థానాలున్నాయి. 2006లో సర్పంచిగా బుజ్జమ్మ విజయం సాధించారు. విద్యాసంస్థలు గ్రామంలో చైతన్య జూనియర్ కళాశాల, జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శ్రీవిద్యా విజ్ఞాన్ మందిర్ ఉన్నత పాఠశాల ఉంది. శారదా విద్యాలయం, ఎవరెస్ట్ టాలెంట్ స్కూల్, విన్నర్స్ కాంసెప్ట్ స్కూల్ ప్రైవేట్ ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. మండల పరిషత్తుకు చెందిన ఒక తెలుగు మీడీయం, ఒక ఉర్దూ మీడియం ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. పులుగు తండా, అంబటోనిపల్లి, దోరితండా, అమ్మాపూర్ తండాలలో ప్రాథమిక పాఠశాలలున్నాయి. ఆంజనేయస్వామి దేవాలయం: గ్రామంలో ప్రధాన రహదారి ప్రక్కనే పురాతనమైన ఆంజనేయస్వామి ఆలయం ఉంది. పూర్తిగా రాతితో కట్టబడిన ఈ ఆలయం ముందు రాతి ధ్వజస్తంభం ఉంది. ఆలయం ఎదురుగా రావిచెట్టు దాని కింద రాతి నాగశిల్పాలున్నాయి. ఆలయం యొక్క చరిత్రకై ఈ బ్లాగు రచయిత ప్రయత్నించిననూ లభ్యం కాలేదు. కొత్తగా నవగ్రహాలు, నాగదేవత ప్రతిమలు ఆలయ సముదాయంలో ప్రతిష్టించారు.
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
20, ఏప్రిల్ 2013, శనివారం
హన్వాడ (Hanwada)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి