7, మే 2013, మంగళవారం

అన్నాసాగర్ (Annasagar)

అన్నాసాగర్ గ్రామము
గ్రామముఅన్నాసాగర్ 
మండలముభూత్పూర్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా2421 (2011)
1377 (2001)
గ్రామ ప్రముఖులుఆల వెంకటేశ్వర రెడ్డి,
అన్నాసాగర్ మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలమునకు చెందిన గ్రామము. భౌగోళికంగా మండలంలో పశ్చిమాన ఉన్న ఈ గ్రామం 44వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్నది. 2011 ప్రకారం గ్రామ జనాభా 2421. 2014లో దేవరకద్ర నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఈ గ్రామమునకు చెందినవారు.

భౌగోళికం:
భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో పశ్చిమం వైపున ఉన్నది. ఈ గ్రామానికి దక్షిణంగా అడ్డాకల్ మండలం సరిహద్దుగా ఉండగా, తూర్పున రావులపల్లి, పశ్చిమాన తాడికొండ, ఉత్తరమున హస్నాపుర్ గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2128. ఇందులో పురుషులు 1072, మహిళలు 1056. గృహాల సంఖ్య 417.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 2421. ఇందులో పురుషులు 1236, మహిళలు 1185. గృహాల సంఖ్య 550. అక్షరాస్యత శాతం 49.52%. గ్రామ కోడ్ సంఖ్య 575550.

రవాణా సౌకర్యాలు:
ఈ గ్రామం 44వ నెంబరు జాతీయ రహదారిపై భూత్పూర్ మరియు అడ్డాకల్ మధ్యలో ఉన్నది. బస్సులు, ప్రైవేట్ వాహనాలు విరివిగా అందుబాటులో ఉన్నవి. మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్ 15కిమీ దూరంలో ఉన్నది.

రాజకీయాలు:
2006 సర్పంచి ఎన్నికలలో బాలవర్థన్ రెడ్డి (కాంగ్రెస్ పార్టీ మద్దతు) గెలుపొందినారు. 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా ఆలంపల్లి మంజుల ఎన్నికయ్యారు. 2014లో దేవరకద్ర నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఈ గ్రామమునకు చెందినవారు.

విద్యాసంస్థలు:
గ్రామంలో ఒక మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల మరియు ఒక ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలున్నాయి.

కాలరేఖ:
  • 2011, ఫిబ్రవరి 23: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు


విభాగాలు: భూత్పూర్ మండలంలోని గ్రామాలు,  44వ నెంబరుజాతీయ రహదారిపై ఉన్న గ్రామాలు,


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist 2001,
  • Census Statistics, Mahabubnagar Dist, 2011,
  • బ్లాగురచయిత పర్యటించి తెలుసుకున్న, సేకరించిన విషయాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక