పి.శంకర్ రావు
| |
స్వస్థలం | హైదరాబాదు |
పదవులు | రాష్ట్ర మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యే |
నియోజకవర్గం | షాద్‌నగర్ (4 సార్లు), కంటోన్మెంట్ (ఒకసారి), |
పి.శంకర్ రావు హైదరాబాదుకు చెందిన రాజకీయ నాయకుడు. వైద్యశాస్త్రం అభ్యసించి ప్రారంభంలో వైద్యవృత్తి చేపట్టిన పి.శంకర రావు 1983లో మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. 1985లో కాంగ్రెస్ పార్టీటికెట్ లభించలేదు. 1987లో షాద్‌నగర్ నుంచే పోటీచేసి రెండోసారి విజయం సాధించారు. 1992లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో చిన్ననీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. 1994లో మళ్ళీ షాద్‌నగర్ నుంచే పోటీచేసి తెలుగుదేశం పార్టీకి చెందిన బక్కని నర్సిములు చేతిలో పరాజయం పొందారు. 1999లో ఇక్కడి నుంచే మూడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో కూడా షాద్‌నగర్ నుంచే పోటీచేసి 4వ సారి శాసనసభలో ప్రవేశించారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో షాద్‌నగర్ ఎస్సీ రిజర్వ్ నుంచి జనరల్‌గా మారడంతో 2009లో శంకర్రావు సికింద్రాబాదు కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2010లో కిరణ్ కుమార్ మంత్రివర్గంలో స్థానం పొందారు. తర్వాత మంత్రిపదవికి రాజీనామా చేశారు.
విభాగాలు: హైదరాబాదు రాజకీయ నాయకులు, మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులు, షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, సికింద్రాబాదు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి