తెలంగాణలోని 17 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ఎం.ఐ.ఎం. పార్టీకి చెందిన అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికయ్యారు.
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ఎం.ఐ.ఎం.కు చెందిన అసదుద్దీన్ ఓవైసీ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన జహీద్ అలిఖాన్‌పై 113865 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అసదుద్దీన్‌కు 308061 ఓట్లు రాగా, జాహెద్ అలీఖాన్‌కు 194196 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పల్లె లక్ష్మణ్ గౌడ్ 3వ స్థానంలో, భాజపా అభ్యర్థి సతీష్ అగర్వాల్ 4వ స్థానంలో, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ఫాతిమాబేగం 5వ స్థానంలో నిలిచారు.
2014 ఎన్నికలు: 2014 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి 17 అభ్యర్థులు నామినేషన్ వేయగా ఒక నామినేషన్లు తిరస్కరించబడింది. తుదిబరిలో 16 అభ్యర్థులు మిగిలారు. ఎంఐఎం పార్టీకి చెందిన అసదుద్దీన్ ఓవైసి తన సమీప ప్రత్యర్థి, భాజపాకు చెందిన భగవంతరావుపై 202454 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 2019 ఎన్నికలు: 2019లో జరిగిన ఎన్నికలలో ఇక్కడి నుంచి మజిజ్ పార్టీకి చెందిన అసదుద్దీన్ ఓవైసీ తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతాపార్టీకి చెందిన భగవంతరావుపై 282186 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. మజ్లిస్ పార్టీ అభ్యర్థికి 517471 ఓట్లు రాగా, భాజపా అభ్యర్థికి 235285 ఓట్లు లభించాయి. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన పుస్తె శ్రీకాంత్ 63,239 ఓట్లతో మూడోస్థానంలో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ 49,944 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. అసదుద్దీన్ విజయం సాధించడం ఇది వరసగా నాలుగోసారి.
= = = = =
|
16, జూన్ 2013, ఆదివారం
హైదరాబాదు లోకసభ నియోజకవర్గం (Hyderabad Loksabha Constituency)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి