14, జూన్ 2013, శుక్రవారం

కాంచనమాల (Kanchanamala)

 చిత్తజల్లు కాంచనమాల 
(1922-1981)
జననంజూన్ 15, 1922
స్వస్థలంతెనాలి
రంగంసినిమా నటి
మరణంజనవరి 24, 1981
గుంటూరు జిల్లా తెనాలిలో జూన్ 15, 1922న జన్మించి, చిన్న వయస్సులోనే సంగీతం, లలితకళలపై దృష్టిసారించి, అంచెలంచెలుగా ఎదిగి సినీనటిగా పేరుగాంచిన చిత్తజల్లు కాంచనమాల పలు చిత్రాల విజయాలకు కారణమైంది. తెలుగు సినీరంగంలో తెరపని ముద్ర వేసి, స్వయంకృషితో చిత్రసీమలో ప్రవేశించి 1935లో తొలిసారిగా శ్రీకృష్ణతులాభారంలో "మిత్రవింద" పాత్రతో ప్రేక్షకులకు పరిచయమై, గూడవల్లి రామబ్రహ్మం తీసిన "మాలపిల్ల"తో హీరోయిన్‌గా రాణించి విప్రనారాయణ, మళ్ళీ పెళ్ళి, గృహలక్ష్మి, వందేమాతరం, ఇల్లాలు, బాలనాగమ్మ, నర్తనశాల తదితర చిత్రాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్న తొలితరం నటి కాంచనమాల. తెలుగు ప్రేక్షకులను ఆనందింపజేసిన ఈ నటి జీవిత చరమదశలో ఆర్థిక మరియు మానసిక ఇబ్బందులకు గురవడం భాధాకరమైన విషయం. జెమినీ అధినేత ఎస్.ఎస్.వాసన్ ఈమె మాటలను రికార్డు చేసి భయపట్టించడంతో తుదకు సినిమాలకు దూరంగా ఉండింది. షష్ఠిపూర్తికి 5నెలల ముందే జనవరి 24, 1981న శాశ్వతంగా కన్నుమూసి వినీలాకాశంలో తారగా మారిన తెలుగుతార కాంచనమాల తెలుగు సినీప్రేక్షకుల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయింది.

గమనిక: నటి జన్మతేది విషయంలో పలు గ్రంథాలలో పలు విధాలుగా ఉంది. సంవత్సరంలో కూడా తేడాలున్నాయి. పాఠకులు గమనించగలరు.

విభాగాలు: గుంటూరు జిల్లా కళాకారులు, తెనాలి, తెలుగు సినిమా నటీమణులు, 1922, 1981,


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక