చిత్తజల్లు కాంచనమాల
(1922-1981)
| |
జననం | జూన్ 15, 1922 |
స్వస్థలం | తెనాలి |
రంగం | సినిమా నటి |
మరణం | జనవరి 24, 1981 |
గుంటూరు జిల్లా తెనాలిలో జూన్ 15, 1922న జన్మించి, చిన్న వయస్సులోనే సంగీతం, లలితకళలపై దృష్టిసారించి, అంచెలంచెలుగా ఎదిగి సినీనటిగా పేరుగాంచిన చిత్తజల్లు కాంచనమాల పలు చిత్రాల విజయాలకు కారణమైంది. తెలుగు సినీరంగంలో తెరపని ముద్ర వేసి, స్వయంకృషితో చిత్రసీమలో ప్రవేశించి 1935లో తొలిసారిగా శ్రీకృష్ణతులాభారంలో "మిత్రవింద" పాత్రతో ప్రేక్షకులకు పరిచయమై, గూడవల్లి రామబ్రహ్మం తీసిన "మాలపిల్ల"తో హీరోయిన్‌గా రాణించి విప్రనారాయణ, మళ్ళీ పెళ్ళి, గృహలక్ష్మి, వందేమాతరం, ఇల్లాలు, బాలనాగమ్మ, నర్తనశాల తదితర చిత్రాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్న తొలితరం నటి కాంచనమాల. తెలుగు ప్రేక్షకులను ఆనందింపజేసిన ఈ నటి జీవిత చరమదశలో ఆర్థిక మరియు మానసిక ఇబ్బందులకు గురవడం భాధాకరమైన విషయం. జెమినీ అధినేత ఎస్.ఎస్.వాసన్ ఈమె మాటలను రికార్డు చేసి భయపట్టించడంతో తుదకు సినిమాలకు దూరంగా ఉండింది. షష్ఠిపూర్తికి 5నెలల ముందే జనవరి 24, 1981న శాశ్వతంగా కన్నుమూసి వినీలాకాశంలో తారగా మారిన తెలుగుతార కాంచనమాల తెలుగు సినీప్రేక్షకుల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయింది.
గమనిక: నటి జన్మతేది విషయంలో పలు గ్రంథాలలో పలు విధాలుగా ఉంది. సంవత్సరంలో కూడా తేడాలున్నాయి. పాఠకులు గమనించగలరు.
గమనిక: నటి జన్మతేది విషయంలో పలు గ్రంథాలలో పలు విధాలుగా ఉంది. సంవత్సరంలో కూడా తేడాలున్నాయి. పాఠకులు గమనించగలరు.
విభాగాలు: గుంటూరు జిల్లా కళాకారులు, తెనాలి, తెలుగు సినిమా నటీమణులు, 1922, 1981, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి