25, జూన్ 2013, మంగళవారం

కిల్లి కృపారాణి (Killi Krupa Rani)

 కిల్లి కృపారాణి
జననం19 నవంబరు, 1965
జిల్లాశ్రీకాకుళం
పదవులుకేంద్రమంత్రి
నియోజకవర్గంశ్రీకాకుళం 
కిల్లి కృపారాణి శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజకీయ నాయకురాలు. 19 నవంబరు,1965న జన్మించిన కృపారాణి విశాఖపట్టణంలోని ఆంధ్రా మెడికల్ కళాశాల నుంచి ఎంబీబీఎస్ పట్టా పొంది, టెక్కలిలో వైద్యురాలిగా పనిచేశారు. 2009లో శ్రీకాకుళం నుంచి లోకసభకు ఎన్నికై 2012లో కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. 2011లో లండన్ లో జరిగిన రిపబ్లిక్ కామన్వెల్త్ క్రీడలకు భారత ప్రతినిధిగా వెళ్ళారు.

రాజకీయ ప్రస్థానం:
కృపారాణి రాజకీయాలలో ప్రవేశించి 2004లో లోకసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఎర్రన్నాయుడు చేతిలో పరాజయం పొందారు. 2008లో డీసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. 2009లోమరోసారి  శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేసి 4సార్లు ఎంపీ అయిన కింజరాపు ఎర్రంనాయుడుపై విజయం సాధించారు. అక్టోబరు 28, 2012నాడు కమ్యునికేషన్, ఐటి సహాయమంత్రిగా  కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందారు.

కుటుంబం:
1985లో కిల్లి రామ్మోహనరావుతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరుకుమారులు. కృపారాణి "ద 100 ఇయర్స్ సాగా ఆఫ్ నెహ్రూస్ ఫ్యామిలీ" పుస్తకాన్ని రచించారు.

విభాగాలు: శ్రీకాకుళం జిల్లా రాజకీయ నాయకులు, శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గం, శ్రీకాకుళం, 15వ లోకసభ సభ్యులు, 1965, కేంద్రమంత్రులు,


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక