2, జూన్ 2013, ఆదివారం

కె.వీరారెడ్డి (K.Veera Reddy)

 కె.వీరారెడ్డి
గ్రామముతీలేరు
మండలముధన్వాడ
జిల్లామహబూబ్‌నగర్
పదవులుశాసనసభ్యులు, డిసిసిబి అధ్యక్షులు, ఆప్కాబ్ చైర్మెన్,
కె.వీరారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినరాజకీయ నాయకుడు. ధన్వాడ మండలము తీలేరు గ్రామానికి చెందిన వీరారెడ్డి శాసనసభ్యుడిగా, డిసిసిబి అధ్యక్షుడిగా పనిచేశారు. 2013లో రాష్ట్ర సహకార బ్యాంకు (ఆప్కాబ్) చైర్మెన్‌గా ఎన్నికయ్యారు.

రాజకీయ ప్రస్థానం:
వీరారెడ్డి 1978లో అమరచింత నియోజకవర్గం నుంచి ఇందిరా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి మాజీ సంస్థానాధీశుడు సోమభూపాల్ పై విజయం సాధించారు. 1983, 1985లలో తెలుగుదేశం పార్టీ చేతిలో ఓడిపోయారు. 1989లో కొత్తకోట దయాకర్ రెడ్డి పై విజయం సాధించి రెండోసారి శాసనసభలో ప్రవేశించారు. 1994, 1999లలో దయాకర్ రెడ్డి చేతిలో పరాజయం పొందారు. 2007లో సహకార సంఘ ఎన్నికలలో తీలేరు సహకార సంఘం చైర్మెన్‌గా ఎన్నికై డిసిసిబి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. 2013లో కూడా తీలేరు నుంచి చైర్మెన్‌గా ఎన్నికై, డిసిసిబి అధ్యక్షులుగా, రాష్ట్ర సహకార సంఘం (ఆప్కాబ్) చైర్మెన్‌గా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఎన్నికైన తొలి జిల్లా నాయకుడుగా ఘనత పొందారు.

కుటుంబం:
వీరారెడ్డి తల్లి వజ్రమ్మ 2006లో తీలేరు సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈమె డిసెంబరు 30, 2014న మరణించారు.

విభాగాలు:  మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులుధన్వాడ మండలము,  అమరచింత అసెంబ్లీ నియోజకవర్గం,


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక