2, జూన్ 2013, ఆదివారం

తీలేరు (Teelair)


  తీలేరు గ్రామము
గ్రామముతీలేరు
మండలముధన్వాడ
జిల్లానారాయణపేట
జనాభా2136 (2001),
3039 (2011),
గ్రామ ప్రముఖులుకె.వీరారెడ్డి
తీలేరు నారాయణపేట జిల్లా ధన్వాడ మండలమునకు చెందిన గ్రామము. డిసిసిబి అధ్యక్షుడిగా, రాష్ట్ర ఆప్కాబ్ చైర్మెన్‌గా ఉన్న కె.వీరారెడ్డి ఈ గ్రామానికి చెందినవారు. తీలేరులో రైతు సహకార సంఘం ఉంది. 2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3039. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలం ఫిబ్రవరి 17, 2019న కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లాలో భాగమైంది.

భౌగోళికం, సరిహద్దులు:
భౌగోళికంగా ఈ గ్రామం మండలంలో దక్షిణం వైపున ఉంది. గ్రామానికి తూర్పున వెంకటాపూర్, దక్షిణాన పెద్దచింతకుంట శివారు, పశ్చిమాన మరికల్, మాధ్వార్ గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2136. ఇందులో పురుషులు 1065, మహిళలు 1071. గృహాల సంఖ్య 364.
2011 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3039. ఇందులో పురుషులు 1491, మహిళలు 1548. గృహాల సంఖ్య 562. అక్షరాస్యత శాతం 37.31%. గ్రామకోడ్ సంఖ్య 575509.

రవాణా సౌకర్యాలు:
గ్రామానికి దక్షిణం వైపు నుంచి మహబూబ్‌నగర్-రాయచూరు అంతర్రాష్ట్ర రహదారి వెళ్ళుచున్నది. ప్రధాన కూడలి అయిన మరికల్ ఈ గ్రామానికి పశ్చిమాన కొద్ది దూరంలో ఉంది.

రాజకీయాలు:
  • 2006లో తీలేరు సర్పంచిగా వజ్రమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైనారు.
  • 2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా సవారప్ప ఎన్నికైనారు.
  • 2014 ఎంపీటీసి ఎన్నికలలో తిరుపతమ్మ (తెదేపా) ఎన్నికయ్యారు.

విద్యాసంస్థలు:
గ్రామంలో ఒక మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నది.

కాలరేఖ:
  • 2014, డిసెంబరు 30: తీలేరు మాజీ సర్పంచి వజ్రమ్మ మరణించారు.

విభాగాలు: ధన్వాడ మండలంలోని గ్రామాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక