పెంటమరాజు సుదర్శనరావు
| |
జననం | సెప్టెంబరు 11, 1930 |
స్వగ్రామం | శ్రీపురం (నాగర్‌కర్నూల్ మండలం) |
జిల్లా | మహబూబ్‌నగర్ |
రంగం | విమోచనోద్యమం, రాజకీయాలు |
పెంటమరాజు సుదర్శనరావు 1930 సెప్టెంబరు 11న నాగర్‌కర్నూల్ లో జన్మించారు. స్వగ్రామం శ్రీపురం. ఇతని తండ్రి గ్రామ పోలీస్ పటేల్ గా పనిచేశారు. సుదర్శనరావు నిజాం దాష్టీకాలను భరించలేక నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. 1953-61 వరకు ఉపాధ్యాయునిగా పనిచేసి 1964-70 వరకు శ్రీపురం గ్రామ సర్పంచిగా పనిచేశారు. జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. 1972-80 కాలంలో నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్ కమిటి అధ్యక్షులుగా పనిచేశారు. రెండుసార్లు పంచాయతి సమితి సభ్యులుగా కొనసాగారు.
విభాగాలు: పాలమూరు జిల్లా సమరయోధులు, నాగర్‌కర్నూల్ మండలము, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి