7, జూన్ 2013, శుక్రవారం

నటరాజ రామకృష్ణ (Nataraja Ramakrishna)

  నటరాజ రామకృష్ణ
(1923-2011)
జననంమార్చి 21, 1923
రంగంనాట్యాచార్యుడు
బిరుదులునటరాజ, భారత కళాప్రపూర్ణ
మరణంజూన్ 7, 2011
పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు నటరాజ రామకృష్ణ. ఇతను ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో భారత్ నుంచి వెళ్ళిన కుటుంబంలో మార్చి 21, 1923న జన్మించారు.  చిన్నవయస్సులోనే తల్లి మరణించింది. ఆ తర్వాత కుటుంబం భారతదేశానికి తిరిగి వచ్చింది.

చిన్నవయస్సు నుంచే రామకృష్ణ సాంప్రదాయ నృత్యాలపై మక్కువ చూపించారు. ఆయన తనలోని కళాతృష్ణ అన్వేషణలో మీనాక్షి సుందరం పిళ్ళై, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్ర్తి, శ్రీమతి నాయుడుపేట రాజమ్మ, పెండెల సత్యభామ లాంటి మహామహులైన కళా గురువులను కలుసుకొని వారి నుండి ఎన్నో నాట్యరీతుల్ని నేర్చుకున్నారు. కాకతీయుల కాలం నాటి నృత్యం పేరిణి శివతాండవంను రామకృష్ణ వెలుగులోకి తెచ్చారు. నవజనార్థన పారిజాతం అనే నాట్య ప్రక్రియను సృష్టించారు.

ఆంధ్రనాట్యం, పేరిణి నృత్యాల పురోగతికై ‘నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యం’ సంస్థను నెలకొల్పారు. హైదరాబాదులోని తారామతి, ప్రేమావతి మందిరాలను బాగు చేయించారు. భరతనాట్యం, కూచిపూడి లాంటి భారతీయ నృత్య సంప్రదాయాలను ఆకళింపు చేసుకొని తెలుగువారి సంస్కృతికి దర్పణమైన ఆంధ్ర నాట్యాన్ని పునరుద్ధరించి ప్రపంచ వ్యాప్తంగా బహుళ ప్రచారం చేసిన కళాకారుడిగా రామకృష్ణ పేరుపొందారు. దేవదాసీల నృత్యరీతులను నటరాజ రామకృష్ణ ఆంధ్రనాట్యం పేరుతో సుస్థితం చేశారు. 15 సం.ల వయస్సులోనే నాట్యగ్రంథాలు వ్రాయడం మొదలుపెట్టి మొత్తం 41 గ్రంథాలు పూర్తిచేశారు.

బందార సంస్థానం రాజా గణపతిపాండ్య రామకృష్ణను నటరాజ బిరుదుతో సత్కరించినది. 1968లో "భారత కళాప్రపూర్ణ" బిరుదుతో ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమిచే సత్కరించబడ్డారు. 1980లో శ్రీశైలం దేవస్థానం ఆస్థాన నాట్యాచార్యుడిగా నియమించబడ్డారు. 1992లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డు స్వీకరించారు. 2000 సంవత్సరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తరపున విశిష్ట పురస్కారం అందుకున్నారు. పేరిణీశివతాండవానికి అంతర్జాతీయఖ్యాతి తెచ్చిపెట్టిన రామకృష్ణ. జూన్ 7, 2011న హైదరాబాదులో మరణించారు.


విభాగాలు:నాట్యకళాకారులు,


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక