16, జూన్ 2013, ఆదివారం

రాజమండ్రి లోకసభ నియోజకవర్గం (Rajamundry Loksabha Constituency)

రాజమండ్రి లోకసభ నియోజకవర్గం
జిల్లాతూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి
ప్రస్తుత ఎంపిమార్గని భరత్
పార్టీవైకాపా


ఆంధ్రప్రదేశ్ లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 7 అసెంబ్లీ నియోజక వర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకు చెందిన మార్గని భరత్ ఎన్నికయ్యారు.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
  • అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం
  • రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం
  • రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గం
  • రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం
  • కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం
  • నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం
  • గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ)

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
1వ 1952-57 నల్లా రెడ్డి నాయుడు సీపీఐ
2వ 1957-62 డి.ఎస్.రాజు కాంగ్రెస్ పార్టీ
3వ 1962-67 డి.ఎస్.రాజు కాంగ్రెస్ పార్టీ
4వ 1967-71 డి.ఎస్.రాజు కాంగ్రెస్ పార్టీ
5వ 1971-77 ఎస్.బి.పి.పట్టాభి రామారావు కాంగ్రెస్ పార్టీ
6వ 1977-80 ఎస్.బి.పి.పట్టాభి రామారావు కాంగ్రెస్ పార్టీ
7వ 1980-84 ఎస్.బి.పి.పట్టాభి రామారావు కాంగ్రెస్ పార్టీ
8వ 1984-89 చుండ్రు శ్రీహరిరావు తెలుగుదేశం పార్టీ
9వ 1989-91 జూలూరి జమున కాంగ్రెస్ పార్టీ
10వ 1991-96 కె.వి.ఆర్. చౌదరి తెలుగుదేశం పార్టీ
11వ 1996-98 చిట్టూరి రవీంద్ర కాంగ్రెస్ పార్టీ
12వ 1998-99 గిరజాల వెంకటస్వామి నాయుడు భారతీయ జనతా పార్టీ
13వ 1999-04 ఎస్.బి.పి.బి.కె.సత్యనారాయణరావు భారతీయ జనతా పార్టీ
14వ 2004-09 ఉండవల్లి అరుణ కుమార్ కాంగ్రెస్ పార్టీ
15వ 2009-14 ఉండవల్లి అరుణ కుమార్ కాంగ్రెస్ పార్టీ
16వ 2014-19 మురళీమోహన్ తెలుగుదేశం పార్టీ
17వ 2019- మార్గని భరత్ వైకాపాకు

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన సిటింగ్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన ఎం.మురళీమోహన్‌పై 2,147 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు. ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు 357449 ఓట్లు రాగా, మురళీమోహన్‌కు 355302 ఓట్లు లభించాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కృష్ణంరాజు 3వ స్థానంలో నిలిచారు.

2019 ఎన్నికలు:
2019 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైకాపాకు చెందిన మార్గని భరత్ తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన మాగంటి రూపపై 1,21,634 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైకాపా అభ్యర్థికి 5,82,024 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 4,60,390 ఓట్లు లభించాయి. 


హోం,
విభాగాలు: తూర్పు గోదావరి జిల్లా నియోజకవర్గాలు, పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గాలు, రాజమండ్రి లోకసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక