16, జూన్ 2013, ఆదివారం

వరంగల్ లోకసభ నియోజకవర్గం (Warangal Loksabha Constituency)

వరంగల్ లోకసభ నియోజకవర్గం
జిల్లావరంగల్ జిల్లా
ప్రస్తుత ఎంపికడియం శ్రీహరి
పార్టీతెలంగాణ రాష్ట్ర సమితి


తెలంగాణలోని 17 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజకవర్గంలో వరంగల్ జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడినది. 2014లో జరిగిన 16వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన కడియం శ్రీహరి ఎన్నికయ్యారు.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
1వ 1952-57

2వ 1957-62 సాదత్ ఆలీ ఖాన్ కాంగ్రెస్ పార్టీ
3వ 1962-67 బాకర్ ఆలీ మిర్జా కాంగ్రెస్ పార్టీ
4వ 1967-71 రామసహాయం సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
5వ 1971-77 ఎస్.బి.గిరి తెలంగాణ ప్రజాసమితి
6వ 1977-80 జి.మల్లికార్జునరావు కాంగ్రెస్ పార్టీ
7వ 1980-84 కమాలుద్దీన్ అహ్మద్ కాంగ్రెస్ పార్టీ
8వ 1984-89 టి. కల్పనాదేవి తెలుగుదేశం పార్టీ
9వ 1989-91 రామసహాయం సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
10వ 1991-96 రామసహాయం సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
11వ 1996-98 చందూలాల్ అజ్మీరా తెలుగుదేశం పార్టీ
12వ 1998-99 చందూలాల్ అజ్మీరా తెలుగుదేశం పార్టీ
13వ 1999-04 బోడకుంటి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ
14వ 2004-08 ధరావత్ రవీందర్ నాయక్ తెలంగాణ రాష్ట్ర సమితి

2008-09 ఎర్రబెల్లి దయాకరరావు తెలుగుదేశం పార్టీ
15వ 2009-14 సిరిసిల్ల రాజయ్య కాంగ్రెస్ పార్టీ
16వ 2014- కడియం శ్రీహరి తెలంగాణ రాష్ట్ర సమితి

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య తన సమీప ప్రత్యర్థి తెరాస అభ్యర్థి అయిన ఆర్.పరమేశ్వర్‌పై 1,24,661 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. రాజయ్య 396568 ఓట్లు పొందగా, పరమేశ్వర్‌కు 271907 ఓట్లు లభించాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన డి.సాంబయ్య 135697 ఓట్లతో 3వ స్థానం, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి సీహెచ్ రాజమౌళి 108390 ఓట్లతో 4వ స్థానం, భాజపా అభ్యర్థి వి.జయపాల్ 36064 ఓట్లు పొంది 5వ స్థానంలో నిలిచారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి 14 అభ్యర్థులు నామినేషన్లు వేయగా ఒక నామినేషన్ తిరస్కరించబడింది. ఒకరు నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. తుదిబరిలో 12 అభ్యర్థులు మిగిలారు. తెరాసకు చెందిన కడియం శ్రీహరి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజయ్యపై 392937 ఓట్ల మెజారిటితో విజయం సాధించి తొలిసారి లోకసభలో ప్రవేశించారు.


విభాగాలు: వరంగల్ జిల్లా నియోజకవర్గాలు, వరంగల్ లోకసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక