6, జులై 2013, శనివారం

అలనాటి సర్పంచులు

దేశానికి పునాది గ్రామాలే అని అన్నారు మహాత్మాగాంధీ. ఎందరో రాజకీయ నాయకులకు కూడా గ్రామసర్పంచి పదవులు వారి రాజకీయ పునాదులుగా మారాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మన జిల్లా రాజకీయ చరిత్రను పరిశీలిస్తే గ్రామపంచాయతి వార్డు మెంబర్లుగా, గ్రామసర్పంచిగా రాజకీయ ఆరంగేట్రం చేసి తదనంతర కాలంలో ఉన్నత పదవులు పొందిన నేతల సంఖ్య లెక్కించడానికి చేతివేళ్ళు సరిపోవు. సర్పంచు పదవులు అలంకరించి గ్రామాభ్యుదయానికి పాటుపడి దశదశలుగా రాజకీయంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మండల అధ్యక్షులుగా, జడ్పీటిసి సభ్యులుగా, శాసనసభ్యులుగా, జిల్లాపరిషత్తు చైర్మెన్లుగా, రాజ్యసభ సభ్యులుగా, రాష్ట్ర మంత్రులుగా, రాష్ట్రస్థాయి ఉన్నత కార్పోరేషన్ నామినేట్ పదవులు పొందినవారు జిల్లాలో అనేకులున్నారు. ఒక్కసారి వారిపై దృష్టిసారిస్తే-
  • 1962లో వనపర్తి సర్పంచిగా రాజకీయ జీవనం ఆరంభించిన ఏ.బాలకిష్టయ్య 1983, 1985లలో వనపర్తి శాసనసభ్యుడుగా ఎన్నిక కావడమే కాకుండా ఆర్టీసి గోల్కొండ రీజియన్ చైర్మెన్ గానూ పనిచేశారు.
  • 2003లో ఆలంపూర్ మేజర్ గ్రామపంచాయతి సర్పంచిగా పనిచేసిన చల్లా వెంకట్రాంరెడ్డి 2004లో ఆలంపూర్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.
  • 1970లో కల్వకుర్తి మేజర్ గ్రామపంచాయతి వార్డు సభ్యునిగా, 1973, 1981లలో సర్పంచిగా ఎన్నికైన ఎడ్మకిష్టారెడ్డి కల్వకుర్తి మండల అధ్యక్షులుగా, రెండుసార్లు కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
  • 1981లో చల్లంపల్లి గ్రామ సర్పంచిగా ఎన్నికైన గుర్కా జైపాల్ యాదవ్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడమే కాకుండా, జడ్పీటీసి సభ్యుడిగా, 1999, 2009లలో కల్వకుర్తి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
  • సింగాయపల్లి గ్రామసర్పంచిగా పనిచేసిన కొత్త రామచంద్రారావు డిసిసి, పిసిసి ప్రధాన కార్యదర్శిగా, విద్యుత్ బోర్డు డైరెక్టరుగా, కొల్లాపూర్ శాసనసభ్యుడిగా పనిచేశారు.
  • తూడుకుర్తి సర్పంచిగా రాజకీయ ప్రస్థానం ఆరంభించిన కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి 2006-11 కాలంలో జిల్లా పరిషత్తు చైర్మెన్‌గా పనిచేశారు.
  • గుమ్మడం గ్రామసర్పంచిగా పనిచేసిన మూలమళ్ళ జయరాములు 1978లో వనపర్తి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.
  • 1964లో కోడంగల్ గ్రామపంచాయతి సర్పంచిగా ఎన్నికైన నందారం వెంకటయ్య మూడు సార్లు కోడంగల్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు.
  • 1972లో కోడంగల్ మేజర్ గ్రామపంచాయతి సర్పంచిగా ఆరంగేట్రం చేసిన రావులపల్లి గురునాథ్ రెడ్డి 5 సార్లు కోడంగల్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.
  • 1982లో కానాయపల్లి సర్పంచిగా ఎన్నికైన రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మెన్‌గా పనిచేయడమే కాకుండా 1994, 2009లలో వనపర్తి ఎమ్మెల్యేగా, 2002, 2008లలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ విప్‌గానూ పనిచేశారు.
  • ఆమనగల్ మేజర్ గ్రామపంచాయతి సర్పంచిగా పనిచేసిన తల్లోజు ఆచారి భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షులుగా పదవి పొందారు.
  • ఉట్కూరు పంచాయతి వార్డు సభ్యునిగా, సర్పంచిగా పనిచేసిన ఎల్కోటి ఎల్లారెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడమే కాకుండా, రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు.
  • 1953లో ఎండమెట్ల సర్పంచిగా రాజకీయ జీవనం ఆరంభించిన వీఎన్ గౌడ్ 3 సార్లు ఎమ్మెల్యేగా, జిలా పరిషత్తు చైర్మెన్‌గా పనిచేశారు. వీరి కుమారుడు వంగా మోహన్ గౌడ్ నాగర్‌కర్నూల్ సర్పంచిగా, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
.
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా సమాచారం


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక