జిల్లా | రంగారెడ్డి |
రెవెన్యూ డివిజన్ | తాండూరు |
అసెంబ్లీ నియోజకవర్గం | తాండూరు |
లోకసభ నియోజకవర్గం | చేవెళ్ళ |
జనాభా | 51935 (2011), |
పెద్దెముల్ మండలము వికారాబాదు జిల్లాకు చెందిన 18 మండలాలలో ఒకటి. ఈ మండలము తాండూరు రెవెన్యూ డివిజన్, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. భౌగోళికంగా జిల్లాలో పశ్చిమం వైపున ఉన్న ఈ మండలము 235 చకిమీ వైశాల్యం కలిగి ఉంది. రంగారెడ్డి జిల్లా పశ్చిమ భాగంలోని పెద్ద ప్రాజెక్టు కోట్‌పల్లి ప్రాజెక్టు ఈ మండలంలోనే ఉంది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 51935.మండలంలో 34 రెవెన్యూ గ్రామాలు, 25 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ప్రముఖ కథారచయిత్రి గోగు శ్యామల ఈ మండలానికి చెందినవారు.
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలమునకు తూర్పున బంటారం, ధరూర్ మండలాలు, దక్షిణాన యాలాల మండలము, పశ్చిమాన తాండూరు మండలము సరిహద్దులుగా ఉండగా ఉత్తరాన కర్ణాటక రాష్ట్రం సరిహద్దుగా ఉన్నది.
జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 47855. ఇందులో పురుషులు 24033, మహిళలు 23822. 1991 జనాభాతో పోలిస్తే దశాబ్ద కాలంలో 14.85% వృద్ధి సాధించింది. 2001 లెక్కల ప్రకారం రంగారెడ్డి జిల్లాలో అత్యధిక జనాభా కల మండలాలలో ఇది 25వ స్థానంలో ఉంది.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 51935. ఇందులో పురుషులు 25759, మహిళలు 26176. అక్షరాస్యుల సంఖ్య 25156. స్త్రీపురుష నిష్పత్తిలో (1016/వెయ్యి పురుషులకు) ఈ మండలం జిల్లాలో మూడవ స్థానంలో ఉంది.
రవాణా సౌకర్యాలు:
హైదరాబాదు-వాడి రైలుమార్గం మండలం దక్షిణం గుండా వెళ్ళుచున్నది. కాని మండలంలో రైల్వేస్టేషన్ లేదు. హైదరాబాదు-తాండూరు ప్రధాన రోడ్డుమార్గం మండలం నుంచి వెళ్ళుచున్నది. అలాగే తాండూరు నుంచి బంటారం వైపు వెళ్ళు రహదారి కూడా మండలం గుండా పోవుచున్నది.
రాజకీయాలు:
ఈ మండలము తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2009కు ముందు హైదరాబాదు లోకసభ నియోజకవర్గం పరిధిలో ఉండేది. 2001-06 కాలంలో అంబిక, 2006-11 కాలంలో సంతోష మండల అధ్యక్షులుగా పనిచేశారు. 2019 ప్రాదేశిక ఎన్నికలలో ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన అనురాధ ఎన్నికయ్యారు.

అక్టోబరు 11, 2016కు ముందు రంగారెడ్డి జిల్లాలో పెద్దెముల్ మండల స్థానం |
హోం, విభాగాలు: వికారాబాదు జిల్లా మండలాలు, తాండూరు రెవెన్యూ డివిజన్, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దెముల్ మండలము, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి