26, జులై 2013, శుక్రవారం

కిన్నెరసాని నది (Kinnerasani River)

 కిన్నెరసాని నది
నది పుట్టుక స్థానంమేడారం - తాడ్వాయి కొండలు
నది పొడవు96 KM
నది పరీవాహకప్రాంతం1300 చకిమీ
ప్రాజెక్టులుకిన్నెరసాని ప్రాజెక్టు
కిన్నెరసాని నది గోదావరి నదికి ఉపనది. కిన్నెరసాని వరంగల్ జిల్లాలోని మేడారం - తాడ్వాయి కొండసానువుల్లో పుట్టి ఆగ్నేయంగా ప్రవహించి ఖమ్మం జిల్లాలో భద్రాచలానికి కాస్త దిగువన బూర్గంపాడు, వేలేరు గ్రామాల మధ్యన గోదావరిలో సంగమిస్తుంది. 96 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తున్న ఈ నది యొక్క మొత్తం ఆయకట్టు ప్రాంతం 1300 చదరపు కిలోమీటర్లు.

కిన్నెరసాని నదిపై పాల్వంచ మండలములోని యానంబైలు గ్రామము వద్ద విద్యుత్ ఉత్పాదనకై మరియు కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరందించేందుకు కిన్నెరసాని జలాశయాన్ని నిర్మించారు. 1972లో ప్రాజెక్టు నిర్మాణము పూర్తయింది. కిన్నెరసాని ప్రాజెక్టు వల్ల వ్యవసాయ భూములకు, విద్యుత్ ఉత్పత్తికే కాక పాల్వంచ, కొత్తగూడెం పట్టణ ప్రజలకు త్రాగునీరు కూడా అందజేస్తుంది.

2005లో జలయజ్ఞం పథకం క్రింద పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో పదివేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు కిన్నెరసాని ప్రాజెక్టుకు కుడి మరియు ఎడమ కాల్వల నిర్మాణాన్ని ఆమోదించారు. తొలి విడతలో భాగంగా నిర్మించిన కుడి ప్రధాన కాల్వను 2012లో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రారంభించారు.



విభాగాలు: ఆంధ్రప్రదేశ్ నదులు, ఖమ్మం జిల్లా నదులు, గోదావరి నది, 


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక