15, ఆగస్టు 2013, గురువారం

లాల్‌జాన్ బాషా (Laljan Basha)

 లాల్‌జాన్ బాషా
జననంఆగస్టు 2, 1956
పదవులులోకసభ సభ్యుడు (1991-96)
పార్టీతెలుగుదేశం పార్టీ
మరణంఆగస్టు 15, 2013
లాల్‌జాన్ బాషా ఆగస్టు 2, 1956న గుంటూరులో జన్మించారు. హైస్కూరు వరకు విద్యనభ్యసించారు. 1991లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి గుంటూరు లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా సుధీర్ఘకాలం పనిచేశారు. ఆగస్టు 15, 2013న నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి వద్ద రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

రాజకీయ ప్రస్థానం:
ఎన్టీరామారావు ప్రోద్భలంతో రాజకీయాలలో ప్రవేశించి గుంటురు జిల్లాలో ప్రముఖ రాజకీయ నాయకుడిగా పేరుపొందారు. 1991లో గుంటూరు నుంచి పోటీచేసి ఎన్.జి.రంగా పై విజయం సాధించారు. 1996, 1998లలో రాయపాటి సాంబశివరావు చేతిలో పరాజయం పొందగాం 1999లో నరసారావుపేటనుంచి పోటీచేసి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2002లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా, మైనారిటి సెల్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.

కుటుంబం:
లాల్‌జాన్ బాషా భార్య రజియాబేగం, వీరికి ఒక కుమారుడు, నలుగురు కుమారైలు. బాషా సొదరుడు జియావుద్దీన్ రెండు సార్లు గుంటూరు-1 నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎనికయ్యారు.


విభాగాలు: గుంటూరు జిల్లా రాజకీయ నాయకులు, గుంటూరు, గుంటూరు లోకసభ నియోజకవర్గం, 10వ లోకసభ సభ్యులు, 1956లో జన్మించినవారు, 2013లో మరణించినవారు,


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక