13, ఆగస్టు 2013, మంగళవారం

పైడిమర్రి సుబ్బారావు (Paidimarri Subbarao)

పైడిమర్రి సుబ్బారావు
జననంజూన్ 10, 1916
స్వస్థలంఅన్నెపర్తి (నల్గొండ జిల్లా)
పదవులుజిల్లా కోశాధికారి
రచనలు"ప్రతిజ్ఞ",
మరణంఆగస్టు 13, 1988
భారత జాతీయ "ప్రతిజ్ఞ" రూపకల్పన చేసిన పైడిమర్రి సుబ్బారావు నల్గొండ జిల్లా అన్నెపర్తిలో జూన్ 10, 1916న జన్మించారు. ఇతని విద్యాభ్యాసం నల్లగొండలోనే జరిగింది. పైడిమర్రి సుబ్బారావు బహు భాషావేత్త, మంచి రచయిత. ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ, పారసీ, సంస్కృతం భాషలలో ప్రావీణ్యం ఉంది. ఆయన తన 18వ ఏటనే ‘కాలభైరవుడు’ (1936) పేరున చిన్న నవల రాశారు. పలు నాటకాలు కూడా రచించారు. గోలకొండ, సుజాత, ఆంధ్రపవూతిక, భారతి, నవజీవన్, ఆనందవాణి పత్రికలలో వీరి రచనలు ప్రచురితమైనాయి.1945-46 లలో నల్లగొండ లో జరిగిన ఆంధ్రసారస్వత పరిషత్తు సభలలో ప్రముఖ పాత్ర వహించారు. ఇతను జిల్లా కోశాధికారిగా పనిచేసి పదవివిరమణ పొందారు. ఆగస్టు 13, 1988న సుబ్బారావు మరణించారు.

1962 చైనా యుద్ధ సమయంలో మన విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశ్యంతో పైడిమర్రి ‘ప్రతిజ్ఞ’కు రూపకల్పన చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి 1965, జనవరి 26వ తేదీనుండి ప్రతి పాఠశాలలో ఉదయాన్నే విద్యార్ధుల అసెంబ్లీ సమయంలో ఈ ప్రతిజ్ఞ చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయించారు. తర్వాత ఇది అన్ని భారతీయ భాషల్లోను అనువదించబడింది.



విభాగాలు: నల్గొండ జిల్లా రచయితలు, నల్గొండ మండలము, 1916లో జన్మించినవారు, 1988లో మరణించినవారు,


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక