21, ఆగస్టు 2013, బుధవారం

మాలతీ చందూర్ (Malathi Chandur)

 మాలతీ చందూర్
జననం1930
రంగంరచనలు
అవార్డులుసాహిత్య అకాడమీ అవార్డు-1992
మరణంఆగస్టు 21, 2013
ప్రముఖ రచయితగా పేరుపొందిన మాలతీ చందూర్ కృష్ణా జిల్లా నూజివీడులో 1930లో జన్మించారు. ఆమె ప్రాథమిక విద్య నూజివీడులో జరిగింది. అక్కడ ఎనిమిదవ తరగతి పూర్తి కాగానే చదువుకోవడానికి ఏలూరు వెళ్ళారు. ఏలూరులో వారున్న ఇంటికి దగ్గరగా 'కథావీధి' అనే సాహిత్య పత్రిక ఉండేది. అక్కడికి శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్త్రి, నండూరి సుబ్బారావు, వెంకటచలం, కావలి లక్ష్మీనరసింగం మొదలైన వారు వచ్చేవారు. అప్పుడే ఈమె వీరందరినీ చూడడం జరిగింది. 1947లో చందూర్‌ తో వివాహం జరిగింది. మద్రాసుకు వచ్చిన తరువాతే ప్రైవేటు గా ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తి చేశారు. 1949లో ఆమె రచనా వ్యాసంగం ప్రారంభమైంది. అప్పట్లో రేడియోలో ఆమె రచనలను చదివి వినిపించేవారు. అక్కడే ఆచంట జానకిరాం, బుచ్చిబాబు, జనమంచి రామకృష్ణ, రాజమన్నార్‌, మునిమాణిక్యం నరసింహారావు వంటి వారిని దగ్గరగా గమనించే అవకాశం కలిగింది. 1952 నుంచి రచనా వ్యాసంగంలో తీరిక లేకుండా గడిపారు. ఆగస్టు 21, 2013న మాలతీ చందూర్ చెన్నైలో మరణించారు.

సాహితీ ప్రస్థానం:
1949లో మాలతీ చందూర్ రచనా ప్రస్థానం ఆరంభమైంది. 1952లో రచనలు ఊపందుకున్నాయి. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 1952 నుండి ఆడవారి కోసం ప్రమదావనం అనే Dear Abby వంటి శీర్షికను రెండు దశాబ్దాలకు పైగానే నడిపారు. ఈ శీర్షికలో వంటలు, వార్పులే కాకుండా ఇంగ్లీషు నవలలను పరిచయం చెయ్యటం, విదేశాలలో తిరిగి వచ్చిన వారి చేత వారి అనుభవాలు రాయించటం మొదలైనవి చేస్తూ ఆడవారికి ఒక సలహాదారుగా ఉండి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారు. ఈమె ప్రచురించిన వంటల పుస్తకాలు కొత్తగా పెళ్ళయిన అమ్మాయిలకు ఉపయోగకరంగా ఉండేవి. మాలతీ చందూర్ 'జవాబులు' శీర్షిక పేజీలను వారపత్రికనుండి చించి, పోగుచేసి, పుస్తకాలుగా బైండింగులు చేసి, చాలామంది అపురూపంగా దాచుకొనేవారు.

తెలుగులో పాతిక దాకా మహిళా ప్రధాన నవలలు రాయటమే కాక 300 కు పైగా ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించారు. ఈమె అనువాదాలు జేన్ ఆస్టిన్ నుండి సమకాలీన అరుంధతీ రాయ్ ల రచనల వరకూ ఉన్నాయి. ఇవి 'పాత కెరటాలు' శీర్షికన స్వాతి మాసపత్రికలో ప్రచురించారు. నవలా రచయిత్రిగా, మహిళా వృత్తాలపై కాలమిస్టుగా అనేక పురస్కారాలు అందుకొన్నారు. 70వ దశకములో కేంద్ర సెన్సారు బోర్డు సభ్యురాలిగా పనిచేసిన ఈమె తాను చూసే తమిళ సినిమాలను అర్ధం చేసుకోవటానికి తమిళ భాష నేర్చుకున్నారు. నేర్చుకున్న రెండేళ్లకే అనువాదాలు ప్రారంభించి అనేక తమిళ రచనలను కూడా అనువదించారు.

అవార్డులు:
1992లో హృదయనేత్రి నవలకు గాను సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.



విభాగాలు: తెలుగు రచయితలు,  1930లో జన్మించినవారు,  2013లో మరణించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక