21, ఆగస్టు 2013, బుధవారం

అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం (Avanigadda Assembly Constituency)

అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం
జిల్లాకృష్ణా
ప్రస్తుత ఎమ్మెల్యేసింహాద్రి రమేష్ బాబు
పార్టీవైకాపా


అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం కృష్ణా జిల్లాకు చెందిన శాసనసభ  నియోజకవర్గం. అనకాపల్లి మరియు కాసింకోట మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం మచిలీపట్నం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. యార్లగడ్డ శివరామప్రసాద్, మండలి వెంకటకృష్ణారావు, సింహాద్రి సత్యనారాయణలు ఇక్కడి నుంచి హాట్రిక్ విజయాలను సాధించారు.

నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం నియోజకవర్గం సంఖ్య 195. రాష్ట్ర విభజన తర్వాత నియోజకవర్గ సంఖ్య 76 గా మారింది.దీని పరిధిలోని మండలాలు:
చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, ఘంటసాల ,


ఎన్నికైన శాసనసభ్యులు
 
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1955 యార్లగడ్డ శివరామప్రసాద్ కాంగ్రెస్ పార్టీ చండ్ర రాజేశ్వరరావు సి.పి.ఐ
1962 యార్లగడ్డ శివరామప్రసాద్ కాంగ్రెస్ పార్టీ సనకా బుచ్చికోటయ్య సి.పి.ఐ
1967 యార్లగడ్డ శివరామప్రసాద్ కాంగ్రెస్ పార్టీ సనకా బుచ్చికోటయ్య సి.పి.ఐ
1972 మండలి వెంకటకృష్ణారావు కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ ఎన్నిక
1978 మండలి వెంకటకృష్ణారావు కాంగ్రెస్ పార్టీ సైకం అర్జునరావు జనతా పార్టీ
1983 మండలి వెంకటకృష్ణారావు కాంగ్రెస్ పార్టీ వక్కపట్ల శ్రీరామ ప్రసాద్‌ తెలుగుదేశం పార్టీ
1985 సింహాద్రి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ మండలి వెంకట కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ
1989 సింహాద్రి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ మండలి వెంకట కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ
1994 సింహాద్రి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ మండలి బుద్దప్రసాద్‌ కాంగ్రెస్ పార్టీ
1999 మండలి బుద్ధప్రసాద్ కాంగ్రెస్ పార్టీ బూరగడ్డ రమేష్ నాయుడు తెలుగుదేశం పార్టీ
2004 మండలి బుద్ధప్రసాద్ కాంగ్రెస్ పార్టీ బూరగడ్డ రమేష్ నాయుడు తెలుగుదేశం పార్టీ
2009 అంబటి బ్రాహ్మణయ్య తెలుగుదేశం పార్టీ మండలి బుద్ధప్రసాద్ కాంగ్రెస్ పార్టీ
2013* శ్రీహరి ప్రసాద్ తెలుగుదేశం పార్టీ

2014 మండలి బుద్ధప్రసాద్ తెలుగుదేశం పార్టీ సింహాద్రి రమేష్ వైఎస్సార్ కాంగ్రెస్
2019 సింహాద్రి రమేష్ బాబు వైకాపా మండలి బుద్ధప్రసాద్ తెలుగుదేశం పార్టీ2004 ఎన్నికలు:
2004 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బుడ్డా ప్రసాద్ మండలి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభర్థి బూరగడ్డ రమేష్ నాయుడుపై 8482 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు. ప్రసాద్‌కు 41511 ఓట్లు రాగా, బూరగడ్డ రమేష్ నాయుడు 33029 ఓట్లు పొందినారు. మొత్తం నలుగురు అభ్యర్థులు పోటీచేసిన ఈ నియోజకవర్గంలో స్వతంత్ర్య అభ్యర్థి సింహాద్రి సత్యనారాయణరావు 14845 ఓట్లతో మూడవ స్థానం పొందగా, సి.పి.ఐ.(ఎం.ఎల్) అభ్యర్థి కె.వెంకటనారాయణ 937 ఓట్లతో నాలుగవ స్థానం పొందినారు.

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంబటి బ్రాహ్మణయ్య తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన సిటింగ్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌పై విజయం సాధించారు. 2013లో అంబటి బ్రాహ్మణయ్య ఆకస్మికంగా మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది.

2013 ఉప ఎన్నిక:
2009లో విజయం సాధించిన అంబటి బ్రాహ్మణయ్య ఆకస్మిక మరణంతో 2013 ఆగస్టు 21న ఉప ఎన్నిక నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన బ్రాహ్మణయ్య కుమారుడు శ్రీహరి ప్రసాద్ కు పోటీగా ప్రధాన పార్టీలు నిలబడలేవు. దీనితో శ్రీహరిప్రసాద్ సమీప ఇండిపెండెండెంట్ అభ్యర్థిపై 61643 ఓట్ల ఆధిక్యతతో  సునాహాసంగా విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసిన మండలి బుద్ధప్రసాద్ తన సమీప ప్రత్యర్థి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సింహాద్రి రమేశ్‌పై 5733 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. 

2019 ఎన్నికలు:
2019 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకు చెందిన సింహాద్రి రమేష్ బాబు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ పై 20725 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


విభాగాలు: కృష్ణా జిల్లా నియోజకవర్గాలు, మచిలీపట్నం లోకసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలు


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక