పూసర్ల వెంకట సింధు (Pusarla Venkata Sindhu) తెలంగాణకు చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఈమె జూలై 5, 1995న హైదరాబాదులో జన్మించింది. గోపీచంద్ బ్యాడ్మింటన్ శిక్షణ అకాడమిలో రాటుదేలి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. 2016 ఒలింపిక్స్‌లో రజతపతకం సాధించి ఈ ఘనత పొందిన తొలి భారత క్రీడాకారిణిగా అవతరించింది. 2021లో టోక్యో ఒలింపిక్ క్రీడలలో కూడా కాంస్యపతకం సాధించి 2 ఒలింపిక్ క్రీడలలో పతకాలు సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. క్రీడా ప్రస్థానం: ఎనిమిదేళ్ళ వయస్సులోనే సింధు బ్యాడ్మింటన్ క్రీడలో పేరుగాంచింది. 2009లో కొలంబోలో జరిగిన సబ్-జూనియర్ ఆసియా చాంపియన్‌షిప్‌లో సింధు కాంస్యపతకం సాధించింది. 2010లో ఇరాన్‌లో జరిగిన ఫజర్ ఇంతర్నేషనల్ బ్యాడ్మింటన్ చాలెంజ్‌లో కూడా కాంస్యం చేజిక్కించుకుంది. 2010లో మెక్సికోలో జరిగిన జూనియర్ ప్రపంచ బ్యాండ్మింటన్ చాంప్‌లో క్వార్టర్ ఫైనల్ చేరింది. 2010 ఉబెర్ కప్‌లో భారతజట్టు సభ్యురాలిగా ఉంది. 2011 డచ్ ఓపెన్‌లో సింధు రజతపతకం సాధించింది. 2012లో చైనా ఓపెన్ సూపర్ సీరీస్‌లో సెమీస్ వరకు దూసుకెళ్ళింది. ఇండియా ఓపెన్ గ్రాండ్‌ప్రిక్స్‌లో రజతపతకం గెలుచుకుంది. 2013లో మలేషియా ఓపెన్ గ్రాండ్‌ప్రిక్స్‌లో స్వర్ణం సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంప్‌లో వరసగా రెండుసార్లు కాంస్యపతకం పొందింది. 2016 రియో ఒలింపిక్స్‌లోరజతపతకం సాధించింది. 2021లో టోక్యో ఒలింపిక్ క్రీడలలో కూడా కాంస్యపతకం సాధించి 2 ఒలింపిక్ క్రీడలలో పతకాలు సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. కుటుంబం: పి.వి.సింధు తల్లిదండ్రులు పి.వి.రమణ, విజయలు. వీరిద్దరు వాలీబాల్ క్రీడాకారులు. తండ్రి రమణ 2000లో అర్జున అవార్డు పొందారు.
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
= = = = =
|
10, ఆగస్టు 2013, శనివారం
పి.వి.సింధు (P.V.Sindhu)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి