| |||
జననం | ఆగష్టు 9, 1975 | ||
తండ్రి | ఘట్టమనేని కృష్ణ | ||
భార్య | నమ్రతా శిరోద్కర్ | ||
అవార్డులు | ఉత్తమనటుడుగా బంగారు నంది అవార్డు (200, 2005, 2011), |
తెలుగు సినీరంగంలో ప్రముఖ యువకథానాయకుడిగా పేరుపొందిన మహేష్ బాబు ఆగష్టు 9, 1975 లో చెన్నై నగరంలో ప్రఖ్యాత తెలుగు సినీనటుడు ఘట్టమనేని కృష్ణ మరియు ఇందిరాదేవిలకు జన్మించారు. మహేష్ బాబు తన నాలుగవ ఏట ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు తీసిన నీడ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయం అయ్యారు. మహేష్ బాబు అభ్యసన కాలంలోనే సెలవులలో తన తండ్రి చిత్రాలలో బాలనటుడిగా నటించారు. మహేష్ బాలనటుడిగా తన తండ్రితో కలసి ఏడు చిత్రాలలో నటించారు. హీరోగా నటించిన తొలిచిత్రం రాజ కుమారుడు. 'వంశీ' సినిమాలో తనతో కలసి నటించిన హిందీ నటి, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్‌ని వివాహం చేసుకున్నారు.
సినీప్రస్థానం:
మహేష్ బాబు తన సినీ ప్రస్థానాన్ని "నీడ" చిత్రంలో ఒక చిన్న పాత్ర తో మొదలు పెట్టారు. 1983 లో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మనవి మేరకు పోరాటం సినిమా లో తన తండ్రి కృష్ణ గారికి తమ్ముడి గా నటించాడు. బాల నటుడి గా తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందినారు. 1987 లో తొలిసారిగా తన తండ్రి దర్శకత్వం వహించిన శంఖారావం చిత్రంలో నటించాడు. 1988లో కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన బజార్ రౌడీ చిత్రంలో అన్నయ్య రమేష్ తో కలిసి నటించారు. 1988 లో మరల తన తండ్రి మరియు అన్నయ్యలతో కలిసి ముగ్గురు కొడుకులు సినిమాలో నటించారు. 1989 లో మరోసారి తన తొలి చిత్ర దర్శకుడు కోడిరామకృష్ణ తీసిన గూడచారి 117 చిత్రంలో నటించారు. 1989 లో విడుదలైన కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో మహేష్ తొలిసారి ద్విపాత్రభినయం చేసారు.
హీరోగా మహేశ్ తొలి చిత్రం రాజకుమారుడు. ఆ తర్వాత వచ్చిన యువరాజు, వంశీ చిత్రాలు వ్యాపార పరంగా పెద్ద విజయాల్ని సాధించకపోయినా మహేష్ నటనకు గుర్తింపు లభించింది. 2001లో సోనాలి బింద్రే హీరోయిన్ గా కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రం మహేష్ కు తొలి భారీ విజయాన్ని అందించింది. కానీ 2002 మహేష్ కు సంతృప్తిని ఇవ్వలేదు. ఆ సంవత్సరం విడుదల అయిన టక్కరి దొంగ, బాబీ సినిమాలు రెండూ పరాజయం పాలయ్యాయి. 2003లో మహేష్ కు తను ఎదురుచూస్తున్న విజయం లభించింది. గుణశేఖర్ దర్శకత్వంలో విడుదల అయిన ఒక్కడు చిత్రం 2003వ సంవత్సరానికి అతి పెద్ద హిట్ చిత్రంగా నిలచింది. భూమిక కథానాయికగా, ప్రకాష్ రాజ్ ప్రతినాయకునిగా తయారయిన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని మహేష్ సినీ జీవితంలో మైలురాయిగా నిలచింది. 2003లోనే విడుదల అయిన నిజం చిత్రం పరాజయం పాలయినప్పటికీ మహేష్ నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఈ చిత్రంలోని నటనకుగానూ మహేష్ ఉత్తమ నటునిగా రాష్ట్ర ప్రభుత్వపు బంగారు నంది పురస్కారాన్ని అందుకున్నారు. 2004లో తమిళనాట విజయవంతమైన "న్యూ" చిత్రం మహేష్ ముఖ్యపాత్రధారిగా తెలుగులో నాని గా పునర్నిర్మితమయ్యింది. మహేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించినప్పటికీ ఈ చిత్రం మాత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యింది. అదే యేడాది విడుదలైన అర్జున్ పరాజయం కానప్పటికీ అంచనాలను అందుకోలేదనే చెప్పాలి. అటు పిమ్మట మహేష్ ఒక సంవత్సరం పాటు ఏ చిత్రాన్నీ అంగీకరించలేదు. "అతడు" చిత్ర నిర్మాణంలో పూర్తిగా నిమగ్నమయ్యారు. 2005లో విడుదల అయ్యిన "అతడు" చిత్రం తెలుగునాట మాత్రమే కాక, విదేశాలలోని తెలుగువారి మన్ననలను అందుకుంది. ఈ సినిమాలో నటనకు మహేష్ కు మరొకసారి బంగారు నంది అవార్డు లభించింది. 2006లో మహేష్ నటించిన చిత్రం పోకిరి విడుదల అయ్యింది. వ్యాపార పరంగా ఈ చిత్రం అమోఘమయిన విజయాన్ని నమోదుచేసింది. దక్షిణ భారత సినీ చరిత్రలో ఈ చిత్రం అతి పెద్ద హిట్ గా నిలచింది. ఈ చిత్రానికి గాను మహేష్ ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని సైతం గెలుకున్నారు.
పోకిరీ తరువాత నిర్మాణమయిన సైనికుడు చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. ఆ తరువాత వచ్చిన "అతిథి" చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. ఆ తర్వాత వచ్చిన "దూకుడు" చిత్రం మహేష్ కెరియర్ లోనే ఇంకొక భారీ విజయంగా నిలబడింది. అలాగే "బిజినెస్ మాన్" కూడా ప్రేక్షకుల ఆదరాభిమానాలతో మంచి విజయం నమోదు చేసుకుంది. "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సినిమా ప్రేక్షకాదరణ పొందింది.
కుటుంబం:
మహేష్ కు ఒక అన్నయ్య రమేశ్ బాబు, ఇద్దరు అక్కలు (పద్మావతి మరియు మంజుల) మరియు ఒక చెల్లెలు ప్రియదర్శిని గలరు. భార్య నమ్రతా శొరోద్కర్. వీరి కుమారుడు గౌతమ్ కృష్ణ, కుమర్తె సితార.

విభాగాలు: తెలుగు సినిమా నటులు, 1975లో జన్మించినవారు, |
= = = = =
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి