19, ఆగస్టు 2013, సోమవారం

శనిగరం సంతోష్ రెడ్డి (Sanigaram Santhosh Reddy)

 శనిగరం సంతోష్ రెడ్డి
జననంనవంబరు 12, 1942
స్వగ్రామంముచ్కూరు
జిల్లానిజామాబాదు జిల్లా
పదవులురాష్ట్ర మంత్రి, 4 సార్లు ఎమ్మెల్యే,
నియోజకవర్గంఆర్మూరు అ/ని,
శనిగరం సంతోష్ రెడ్డి నిజామాబాదు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. నవంబరు 12, 1942న ముచ్కూరులో జన్మించిన సంతోష్‌రెడ్డి నిజామాబాదులో బి.ఏ. వరకు అభ్యసనలో ఉన్నప్పుడే రాజకీయాలవైపు దృష్టిసారించారు. కళాశాలలో విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1970లో ముచ్కూరు గ్రామపంచాయతి సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1971లో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించబడ్డారు. 1978లో ఆర్మూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1983లో కూడా వరసగా రెండో సారి శాసనసభకు విజయం సాధించారు. 1989లో మూడవసారి, 2004లో తెరాస తరఫున 4 సారి ఎమ్మెల్యేగా గెలుపొందినారు. నేదురుమల్లి జనార్థన్ రెడ్డి మంత్రివర్గంలో 1990-91లో రోడ్డు, భవనాల శాఖ మంత్రిగా, 1991-92లో ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో 1992–93లో భారీ పరిశ్రమలశాఖ మంత్రిగా కొనసాగినారు. 2004-05లో వైఎస్సార్ మంత్రివర్గంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు.



విభాగాలు: నిజామాబాదు జిల్లా రాజకీయ నాయకులు, రాష్ట్ర మంత్రులు, ఆర్మూరు అసెంబ్లీ నియోజకవర్గం, 6వ శాసనసభ సభ్యులు, 7వ శాసనసభ సభ్యులు, 9వ శాసనసభ సభ్యులు, 12వ శాసనసభ సభ్యులు,1942లో జన్మించినవారు,


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక