2, సెప్టెంబర్ 2013, సోమవారం

ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం (Armur Assembly Constituency)

ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం నిజామాబాదు జిల్లాకు చెందిన 9 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో 3 మండలాలు కలవు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నిజామాబాదు లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 3 మండలాలు కలవు.

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 ఏ.అన్నపూర్ణమ్మ తెలుగుదేశం పార్టీ కే.ఆర్.సురేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 జీవన్ రెడ్డి తెరాస కే.ఆర్.సురేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2018 ఆశన్నగారి జీవన్‌రెడ్డి తెరాస ఆకుల లలిత కాంగ్రెస్ పార్టీ

2009 ఎన్నికలు:
2009లో జరిగిన ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే అయిన ఏలేటి అన్నపుర్ణమ్మ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టి అభ్యర్థి, సిటింగ్ స్పీకర్ అయిన కేతిరెడ్డి సురేష్ రెడ్డిపై 13075 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున మధుశేఖర్ పోటీచేశారు. వీరి ముగ్గురి మధ్యన త్రిముఖ పోటీ జరిగింది. అన్నపూర్ణమ్మకు 49 వేల ఓట్లు, సురేష్ రెడ్డికి 36 వేల ఓట్లు, మధుశేఖర్‌కు 21 వేల ఓట్లు లభించాయి.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాసకు చెందిన జీవన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, శాసనసభ మాజీ స్పీకర్, కాంగ్రెస్ పార్టీకి చెందిన కేతిరెడ్డి సురేష్ రెడ్డిపై 13964 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.

2018 ఎన్నికలు:
2018 డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికలలో TRS పార్టీకి చెందిన ఆశన్నగారి జీవన్‌రెడ్డి ,తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆకుల లలిత పై 28795 ఓట్ల  మెజారిటీతో విజయం సాధించారు. ఆశన్నగారి జీవన్‌రెడ్డి కు ఓట్లు 72125 రాగా,  ఆకుల లలితకు 43330 ఓట్లు లభించాయి.


హోం,
విభాగాలు: నిజామాబాదు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, నిజామాబాదు లోకసభ నియోజకవర్గం, ఆర్మూరు అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక