4, సెప్టెంబర్ 2013, బుధవారం

కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం (Kamareddy Assembly Constituency)

కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నిజామాబాదు జిల్లాకు చెందిన 9 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గ పరిధిలో 4 మండలాలు కలవు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ జహీరాబాదు లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ నియోజకవర్గంలో 2009 నుంచి గంపగోవర్థన్ వరస విజయాలు సాధిస్తున్నారు.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం పరిధిలో 4 మండలాలు కలవు.

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952



1957 టి.ఎన్.సదాలక్ష్మి కాంగ్రెస్ పార్టీ

1962



1967



1972



1978



1983



1985



1989 షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ

1994 గంప గోవర్థన్ తెలుగుదేశం పార్టీ

1999 యూసుఫ్ అలీ తెలుగుదేశం పార్టీ

2004 షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ మురళీధర్ గౌడ్ భారతీయ జనతా పార్టీ
2009 గంప గోవర్థన్తెలుగుదేశం పార్టీ షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ
2012* గంప గోవర్థన్ తెలంగాణ రాష్ట్ర సమితి

2014 గంప గోవర్థన్ తెలంగాణ రాష్ట్ర సమితి షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ
2018 గంప గోవర్థన్ తెరాస షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ

2009 ఎన్నికలు:
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్థన్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర మంత్రి షబ్బీర్ అలీపై 47447 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో గంప గోవర్థన్ పార్టీకి, పదవికి రాజీనామా చేసి, తెరాసలో చేరి ఉప ఎన్నికలలో మళ్ళీ పోటీచేశారు.

2012 ఉప ఎన్నికలు:
2009లో తెదేపా తరఫున విజయం సాధించిన గంప గోవర్థన్ పార్టీకి, పదవికి రాజీనామా సమర్పించగా, 2012లో జరిగిన ఉప ఎన్నికలలో గంప గోవర్థన్ తెరాస తరఫున పోటీచేసి మళ్ళీ విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి సిటింగ్ ఎమ్మెల్యేగా పోటీచేసిన తెరాసకు చెందిన గంప గోవర్థన్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన షబ్బీర్ అలీపై 8283 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2018 ఎన్నికలు:
2018 ఎన్నికలలో తెరాస తరఫున గంప గోవర్థన్, భాజపా తరఫున కె.వెంకట రమణారెడ్డి, జనకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన షబ్బీర్ అలీ పోటీచేశారు. తెరాసకు చెందిన గంప గోవర్థన్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన షబ్బీర్ అలీ పై 4557 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.



విభాగాలు: నిజామాబాదు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, జహీరాబాదు లోకసభ నియోజకవర్గం, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక