కామారెడ్డి నిజామాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలోని గ్రామాలన్నీ పూర్వపు కామారెడ్డి తాలుకాలోని గ్రామాలు. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 17 గ్రామపంచాయతీలు, 21 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలంలో కామారెడ్డి పురపాలక సంఘం కాగా అడ్లూరు, చిన్నమల్లారెడ్డి, దేవన్‌పల్లి పెద్ద గ్రామాలు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్పీ చైర్మెన్‌గా పనిచేసిన సీతాదయాకర్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు.
భౌగోళికం, సరిహద్దులు: కామారెడ్డి మండలం నిజామాబాదు జిల్లాలో ఆగ్నేయంలో ఉంది. ఈ మండలానికి తూర్పున మాచారెడ్డి మండలం, దక్షిణాన భిక్నూరు మండలం, పశ్చిమాన తాడ్వాయి మండలం, ఉత్తరాన సదాశివనగర్ మండలం సరిహద్దులుగాఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 106298. ఇందులో పురుషులు 53478, మహిళలు 52820. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 127642. ఇందులో పురుషులు 63098, మహిళలు 64544. పట్టణ జనాభా 80378, గ్రామీణ జనాభా 47264. అక్షరాస్యత శాతం 72.69%. ఇది జిల్లాలో అత్యధిక అక్షరాస్యత శాతం కల మండలాలలో రెండవ స్థానంలో ఉంది. రాజకీయాలు: ఈ మండలము కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం, జహీరాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. 2014లో ఎంపీపీగా లద్దూరి మంగమ్మ ఎన్నికయ్యారు.
కామారెడ్డి మండలం గుండా రైలుమార్గం మరియు జాతీయ రహదారి వెళ్ళుచున్నాయి. సికింద్రాబాదు నుంచి బోధన్ వెళ్ళు రైలుమార్గం కామారెడ్డి పట్టణం గుండా వెళ్ళుచుండగా, 7వ నెంబరు (కొత్తపేరు 44వ) జాతీయ రహదారి కూడా కామారెడ్డి మీదుగా పోవుచున్నది. ఇది హైదరాబాదు నుంచి 100 కిమీ దూరంలో ఉంది. మండలంలోని గ్రామాలు: అడ్లూర్, ఇల్ఛాపూర్, ఇస్రోజివాడి, ఉగ్రవాయి, కామారెడ్డి (Muncipality), కొటాల్ పల్లి, క్యాసంపల్లి, గర్గుల్, గూడెం, చిన్న మల్లారెడ్డి, టేక్రియాల్, తిమ్మక్ పల్లి, తిమ్మక్కపల్లి (జి), దేవునిపల్లి, నర్సన్నపల్లి, పాతరాజంపేట్, రాఘవాపూర్, రామేశ్వర్‌పల్లి, లింగాపూర్, లింగాయిపల్లి, షాబ్దీపూర్, సారంపల్లి,
= = = = =
|
30, మే 2015, శనివారం
కామారెడ్డి మండలం (Kamareddy Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి