ఒడితెల రాజేశ్వరరావు 1931 సెప్టెంబర్ 16న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలో జన్మించారు. కెప్టెన్ వి లక్ష్మీకాంతారావు (మాజీ మంత్రి) ఆయన సోదరుడు. అనేక ప్రభుత్వ పదవులు నిర్వహించిన ఆయన సింగాపురం రాజేశ్వరరావుగా ప్రసిద్ధి. 1931లో జన్మించిన రాజేశ్వరరావు అనేక విద్యాసంస్థలను నెలకొల్పి, వాటికి ఛైర్మన్‌గా వ్యవహరించారు.
రాజకీయ ప్రస్థానం: ఒడితెల (సింగాపురం) రాజేశ్వరరావు తన చిన్న వయస్సులోనే రాజకీయాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు చేపట్టి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు సన్నిహితంగా ఉంటూ దేశ రాజధానిలో రాజకీయాలను తనదైన శైలిలో చక్రం తిప్పిన నాయకుడిగా గుర్తింపు పొందారు. రాజేశ్వరరావు 1954నుంచి 56వరకు జిల్లా ప్లానింగ్ కమిషన్ మెంబర్‌గా, 56 నుంచి 59వరకు నేషనల్ ఎక్స్‌టెన్షన్ సర్వీస్ భీమదేవరపల్లి బ్లాక్ కో ఆప్షన్ మెంబర్‌గా, 1959 నుంచి 70వరకు సింగాపూర్ సర్పంచ్‌గా, 1970నుంచి 72 వరకు భీమదేవరపల్లి సమితి ప్రెసిడెంట్‌గా, 1972 నుంచి 78వరకు హుజూరాబాద్ ఎమ్మెల్యేగా, 1975-77వరకు వ్యవసాయ అభివృద్ధి బ్యాంకు డైరెక్టర్‌గా పనిచేశారు. 1980 నుంచి 85వరకు ఎమ్మెల్సీగా, 1992-98వరకు రాజ్యసభ సభ్యునిగా, 1994లో ఏఐసీసీ సభ్యునిగా కొనసాగారు. 1993-98 కాలంలో జాతీయ పట్టణ, గ్రామీణ అభివృద్ధి, జాతీయ పర్యాటక అభివృద్ధి, జాతీయ రవాణ మంత్రిత్వ శాఖ కన్సర్వేటివ్ కమిటీ సభ్యునిగా, జాతీయ ఇండస్ట్రీ హౌసింగ్ కమిటీ మెంబర్‌గా పనిచేసి పలు అభివృద్ధి కార్యక్షికమాలకు బాటలు వేశారు. 2004 నుంచి వావిలాల ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ చైర్మన్‌గా ఎంపికై మరణించే వరకు కొనసాగారు. 1989లో హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ ఓడిపోయారు. 2011, జూలై 24న మరణించారు.
= = = = =
|
24, నవంబర్ 2013, ఆదివారం
ఒడితెల రాజేశ్వరరావు (Oditela Rajeshwar Rao)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి