24, నవంబర్ 2013, ఆదివారం

గంగాపూర్ (Gangapur)

 గంగాపూర్  గ్రామము
గ్రామముగంగాపూర్ 
మండలముజడ్చర్ల 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా4338 (2001)
4389 (2011)
గంగాపూర్ మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఈ గ్రామం జడ్చర్ల నుంచి కల్వకుర్తి వెళ్ళు ప్రధాన రహదారికి కొద్దిగా ఎడమవైపున ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన బాదామి చాళుక్యుల కాలం నాటి శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం ఉంది. గంగాపుర్ సమీపంలో దుందుభీనది ప్రవహిస్తుంది.

గ్రామ చరిత్ర:
గంగాపురాన్ని కృతయుగంలో మత్స్యపురి అని, త్రేతాయుగంలో దురితకోలాహరం, ద్వాపరయుగంలో మాయాపురి అని పిలువబడింది. 11వ శతాబ్దిలో పశ్చిమ చాళుక్యులచే చెన్నకేశవస్వామి ఆలయం నిర్మించబడింది.పశ్చిమ చాళుక్యులు వైజయంతిపురం రాజధానిగా, గంగాపురం ఉప రాజధానిగా పాలించారు.

శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం:
గంగాపురంలో క్రీ.శ.11వ శతాబ్దిలో చాళుక్య రాజు మొదటి త్రైలోక్యమల్ల సోమేశ్వరుడి కాలంలో చెన్నకేశవస్వామి ఆలయం నిర్మించబడింది. ఏటా ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. వివిధజిల్లాల నుంచే కాకుండా ప్రక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విచ్చేస్తారు.

జనాభా:
2001 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4338. ఇందులో పురుషులు 2187, మహిళలు 2151. గృహాల సంఖ్య 870.
2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4389. ఇందులో పురుషులు 2224, మహిళలు 2165. గృహాల సంఖ్య 1002, అక్షరాస్యత శాతం 48.48%. గ్రామ కోడ్ సంఖ్య 575370.

రాజకీయాలు:
2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా ఎస్.గోపాల్ యాదవ్ ఎన్నికయ్యారు.

నీటిపారుదల:
గ్రామపరిధిలో 90 ఎకరాల ఆయకట్టు ఉన్న బోచెరువు ఉంది. 2015 మార్చిలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పునరుద్ధరణకు అనుమతి ప్రభుత్వ లభించింది.


విభాగాలు: జడ్చర్ల మండలంలోని గ్రామాలు, 


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక