31, మార్చి 2014, సోమవారం

గొందిమల్ల (Gondimalla)

గొందిమల్ల గ్రామము
గ్రామముగొందిమల్ల 
మండలముఆలంపూర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1253 (2001)
1433 (2011)
గొందిమల్ల మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ మండలమునకు చెందిన గ్రామము. రెవెన్యూ గ్రామ వైశాల్యము 1214 హెక్టార్లు. ఇది పంచాయతి కేంద్రము. ఇక్కడి గుట్టలపై యురేనియం, బంగారం, వజ్రాల కోసం అన్వేషణ జరిగింది. గొందిమళ్ళలో మొగాలిథిక్ (ఇనుప యుగం) యుగానికి చెందిన విస్తారమైన ఖననపు మట్టి దిబ్బ ఉన్నది. ఈ గ్రామం కృష్ణానది మరియు తుంగభద్ర నదుల మధ్యన ఉంది. 2016 కృష్ణా పుష్కరాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ గ్రామంలోనే ప్రారంభించారు.

చరిత్ర:
మొదట ఈ గ్రామము తుంగభద్రా నదీ తీరాన సంగమేశ్వరం సమీపాన ఉండేది. 1980 ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము శ్రీశైలం జలాశయం నిర్మించే సమయంలో గ్రామాన్ని దగ్గరలోనే ఉన్న సురక్షిత ప్రదేశానికి తరలించారు. కొత్త గ్రామాన్ని నిర్మించే సమయంలో రైతులు తమ తమ పొలాలకు దగ్గరిలో ఇళ్ళు నిర్మించుకోవటంతో అది రెండుగా విడిపోయింది. ఎక్కువ జనాభా వున్న గ్రామం సమీపంలో కొండలు ఉండడంతో "తిప్ప" అని, తక్కువ జనాభా వున్న గ్రామం మొరుసుగా వున్న ప్రాంతంలో నిర్మించబడడంతో "మొరసు" అనే పేర్లతో పిలువబడుతున్నవి. ఈ రెండు గ్రామాల మధ్య సుమారు 1.5 కిలోమీటర్ల దూరం వున్నది. పాఠశాల ఈ రెండు గ్రామాలకి మధ్యలో ఉన్నది. ఈ రెండు గ్రామాలను కలిపి గొందిమళ్ళ అని పిలుస్తారు.

వ్యవసాయం, జీవన విధానం:
ఈ గ్రామంలో అందరూ వ్యవసాయదారులే. కొద్దిమంది రైతులకి తప్ప మిగతా అందరి భూములూ వర్షాధారమే. ముఖ్యమైన పంటలు వేరు శనగ, వరి, పప్పు ధాన్యాలు, జొన్న, ప్రొద్దుతిరుగుడు పూలు, మొదలగునవి. ముఖ్య ఆహారములు: వరి అన్నము, జొన్న రొట్టె, పప్పు, కూరగాయలు. చాలా మంది గ్రామస్తులు సమీపాన్నే వున్న కృష్ణా, తుంగభద్రా నదుల్లో చేపలు పట్టి జీవిస్తారు.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1253. ఇందులో పురుషులు 669, మహిళలు 584. గృహాల సంఖ్య 316.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1433. ఇందులో పురుషులు 741, మహిళలు 692. గృహాల సంఖ్య 342. అక్షరాస్యత శాతం 55.55%. గ్రామ కోడ్ సంఖ్య 576435.

రాజకీయాలు:
2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా సుజాత ఎన్నికయ్యారు.

దేవాలయాలు:
తిప్ప దగ్గర ఉన్న ఒక కొండ మీద ఝుంకారేశ్వరీ దేవాలయం నిర్మించబడినది. ఈ దేవాలయం ఉన్న కొండ క్రిందనే కృష్ణా మరియు తుంగభద్రా నదులు కలుస్తాయి

కాలరేఖ:
  • 2016, ఆగస్టు 12: కృష్ణా పుష్కరాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ గ్రామంలోనే ప్రారంభించారు.

విభాగాలు: ఆలంపూర్ మండలంలోని గ్రామాలు


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక