31, మార్చి 2014, సోమవారం

ప్రాగటూరు (Pragatoor)

ప్రాగటూరు గ్రామము
గ్రామముప్రాగటూరు 
మండలముఆలంపూర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా1320 (2001)
1614 (2011)
ప్రాగటూరు మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఈ గ్రామం బిజ్జల వంశీయులకు రాజధానిగా వర్థిల్లినది. పురాతన కోట గ్రామంలో కనిపిస్తుంది. ఈ గ్రామం కృష్ణానదికి తీరాన ఉంది.

చరిత్ర:
17వ శతాబ్దానికి చెందిన కవిరాజు బిజ్జుల తిమ్మభూపాలుడు తెనుగించిన అనర్ఘ రాఘవములో ఈ గ్రామాన్ని ప్రాగటూరు నగరంగా వర్ణించాడు. బిజ్జుల వంశీయులు ప్రాగటూరును రాజధానిగా చేసుకొని ఆలంపురం సీమను పరిపాలించారు. ఈ గ్రామం చుట్టుపక్కల ప్రాంతాలు చరిత్రలో ప్రసిద్ధి చెందినది. ప్రాగటూరులో ఒక ఎత్తయిన కోట ఉన్నది. కోటకు ఉత్తరాన కృష్ణానది ప్రవహిస్తున్నది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1320. ఇందులో పురుషులు 658, మహిళలు 662. గృహాల సంఖ్య 305.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1614. ఇందులో పురుషులు 834, మహిళలు 780. గృహాల సంఖ్య 400. అక్షరాస్యత శాతం 53.66%. గ్రామ కోడ్ సంఖ్య 576427.

రాజకీయాలు:
2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా రాధమ్మ ఎన్నికయ్యారు.
2014 ఎంపీటీసి ఎన్నికలలో సీపీఎం పార్టీకి చెందిన బోయ తిరుపతమ్మ విజయం సాధించారు.

విభాగాలు: ఆలంపూర్ మండలంలోని గ్రామాలు


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక